చిత్రం: మూగనోము (1969)
సంగీతం: ఆర్. గోవర్ధన్
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, సుశీల
నటీనటులు: నాగేశ్వరరావు , జమున
దర్శకత్వం: డి.యోగానంద్
నిర్మాత: ఎ. వి.మియప్పన్
విడుదల తేది: 01.02.1969
ఈ వేళ నాలొ ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
నీ లోని ఆశలన్నీ నా కోసమే
నాపిలుపే నీ లో వలపులై విరిసెలే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే
నీ మాటలో మధువులే పొంగి పోయే (2)
నా లోని ఆణువణువు నీదాయెలే
బ్రతుకంతా నీకే అంకితం చేయనా
నీ లోని ఆశలన్నీ నా కోసమే
నా పిలిపే నీ లో వలపులై విరిసెలే ..
లా …లా… లా…లా…
నీ రూపమే గుండెలో నిండిపోయే
నా స్వప్నమే నేటితో పండిపోయే (2)
ఉయ్యాల జంపాల ఊగేనులే
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
లో లోన ఏవో విరిసెలే వలపులు
లా …లా …లా … ఊ హూ హు..