Most Eligible Bachelor (2021)

అరె గుచ్చే గులాబి లాగా… లిరిక్స్

చిత్రం: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ (2021)
సంగీతం: గోపీ సుందర్‌
సాహిత్యం: అనంత్ శ్రీరామ్, శ్రీమణి
గానం: అర్మాన్‌మాలిక్‌
నటీనటులు: అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌
నిర్మాణం: బన్నీవాస్‌, వాసు వర్మ
విడుదల తేది: 2021

Guche Gulabi Song Telugu Lyrics

అరె గుచ్చే గులాబి లాగా… నా గుండెలోతునే తాకినదే
వెలుగిచ్చే మతాబులాగా… నా రెండు కళ్ళలో నిండినదే, హే… యే

ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే
ఎదురై వచ్చి ఆపేసి నువ్వే… ఎదరేముందో దాచేసినావే
రెప్పల దుప్పటి లోపల… గుప్పెడు ఊహలు నింపావే
కుదురే కదిపేస్తావులే… నిదురే నిలిపేస్తావులే
కదిలే వీలే లేని… వలలు వేస్తావులే
ఎపుడూ వెళ్ళే దారినే… అపుడే మార్చేస్తావులే
నా తీరం మరిచి… నేను నడిచానులే

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

ఊపిరి పని ఊపిరి చేసే… ఊహలు పని ఊహలు చేసే
నా ఆలోచనలోకొచ్చి నువ్వేం చేస్తున్నావే
నేనేం మాటాడాలన్నా… నన్నడిగి కదిలే పెదవే
నా అనుమతి లేకుండానే… నీ పలుకే పలికిందే
ఏమిటే ఈ వైఖరి… ఊరికే ఉంచవుగా మరి
అయ్యా నేనే… ఓ మాదిరి !!

అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
అరె గుచ్చే గులాబి లాగా… వెలుగిచ్చే మతాబులాగా
కళతెచ్చే కళ్ళాపిలాగా… నచ్చావులే భలేగా
ఎవరే నువ్వే ఏం చేసినావే… ఇటుగా నన్నే లాగేసినావే
చిటికే వేసే క్షణంలో… నన్నే చదివేస్తున్నావే

నీకోసం వెతుకుతూ ఉంటే… నే మాయం అవుతున్నానే
నను నాతో మళ్ళీ మళ్ళీ… కొత్తగ వెతికిస్తావే
బదులిమ్మని ప్రశ్నిస్తావే… నను పరుగులు పెట్టిస్తావే
నేనిచ్చిన బదులుని మళ్ళీ… ప్రశ్నగ మారుస్తావే
హే పిల్లో..! నీతో కష్టమే
బళ్ళో గుళ్ళో చెప్పని పాఠమే… నన్నడుగుతు ఉంటే ఏం న్యాయమే

Most Eligible Bachelor Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

మనసా మనసా… లిరిక్స్

చిత్రం: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ (2021)
సంగీతం: గోపీ సుందర్‌
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: సిద్‌ శ్రీరామ్‌
నటీనటులు: అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్‌
నిర్మాణం: బన్నీవాస్‌, వాసు వర్మ
విడుదల తేది: 2021

Manasa Manasa Manasaara Song Telugu Lyrics

మనసా… మనసా….

మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

నా మాట అలుసా.. నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా…

మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

ఏముంది తనలోన.. గమ్మత్తు అంటే
అది తాటి మత్తేదో ఉందంటూ అంటూ
తనకన్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశమంటూ..

నువ్వే నా మాటా… నువ్వే నా మాటా…
వినకుంటే మనసా..
తనే నీ మాట.. వింటుందా ఆ ఆశ…

నా మాట అలుసా.. నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా…

మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

తెలివంత నా సొంతమనుకుంటు తిరిగా
తనముందు నుంచుంటే.. నా పేరు మరిచా

ఆ మాటలే వింటూ, మతిపోయి నిలిచా
బదులెక్కడ ఉందంటూ.. ప్రతిచోటా వెతికా.

తనతో ఉండే… తనతో ఉండే…
ఒక్కొక్క నిమిషం..
మరలా మరలా పుడతావా మనసా…

నా మాట అలుసా.. నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా…

మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

Most Eligible Bachelor Movie Songs Telugu Lyrics

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****