చిత్రం: Mr. మజ్ను (2019)
సంగీతం: ఎస్. ఎస్.థమన్
సాహిత్యం: శ్రీమణి
గానం: అర్మాన్ మాలిక్
నటీనటులు: అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాత: బి.వి.ఎన్. ప్రసాద్
విడుదల తేది: 25.01.2019
ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో
చుక్కలే మాయమైన నింగి లాగ
చుక్కలే కురవలేని మబ్బు లాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో
ఏమైనదో ఏమైనదో
పలుకు మరిచినట్టు పెదవికేమైనదో
ఏమైనదో ఏమైనదో
బరువు పెరిగినట్టు గుండెకేమైనదో
వివరమంటు లేని వింత వేధనా
ఎవరితోటి చెప్పలేని యాతనా
తలను వంచి తప్పుకెళ్లు తప్పే చేశానా
ఎంత మంది వచ్చి వెళ్లి పోయినా
నువ్వెలాగ వేడుకోలు అంచున
ఇంత గుచ్చలేదు నన్ను ఏ పరిచయమైనా
ఓ నీకు నచ్చినట్టు నేనుంటున్నా
ఎందుకంటే చెప్పలేనంటున్నా
అర్ధమవదు నాకు ఇంతగా మారెనా
కాలమే కదలనన్న క్షణము లాగ
ఎన్నడూ తిరగరాని నిన్నలాగ
ఏమిటో ఏమిటో ఏమిటో
చూపెటో దారెటో నడకెటో
ఏమిటో ఏమిటో ఏమిటో
నువ్వెటో నేనెటో మనసెటో