Muddula Koduku (2005)

చిత్రం: ముద్దుల కొడుకు (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం & శివ గణేష్
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత
నటీనటులు: రవి కృష్ణ , గోపిక , రేవతి
దర్శకత్వం: రాధా మోహన్
నిర్మాత: ఎ. యమ్. రత్నం
విడుదల తేది: 01.09.2005

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
పూలనే కోయగానే కొమ్మలే బాధపడే ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే
హే అక్కా అక్కా రమ్మక్కా
నువు దిక్కులు గిక్కులు చూడక్కా
హే దారిని పోయే దానక్క
దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే

బాష అందం భావం అందం
లోకమంత అందం నువ్వు
అందం నువ్వు ఆనందం రేపటికై నేనందం
ఒకటి పోతే ఒకటి వచ్చే దేవుని తీర్పు ఇది
బ్రతుకు అంటే జూదమవ్వదా పోయినా వచ్చుటకు
ఉదయం నీకోసం  నా హృదయం నీకోసం
దైవం నీవేనా నే వరములను ఆడిగేనా
బాధలు ఎవరికి లేవు తీరేవవికాదు

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే

అందమంటే  అందమంటే మనసునే అంటారు
మనసు అందం ముఖములోనే కనిపించునంటారు
కన్నె వలపు పడుచు పిలుపు  అన్నిటికి ఆశపడు
ఆశపడితే అవస్థలేగా చివరకి మిగిలెను
బ్రతుకే ఒక బరువా చిరుగాలికి ఒక బరువా
ఆహా నీ మాట నా చెవులకి బరువేలే
పాడనా ఓ పాట ఎందుకే ఈ వేట

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
పూలనే కోయగానే కొమ్మలే బాధపడే ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే
హే అక్కా అక్కా రమ్మక్కా
నువు దిక్కులు గిక్కులు చూడక్కా
హే దారిని పోయే దానక్క
దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క

error: Content is protected !!