చిత్రం: ముద్దుల మావయ్య (1989)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర, యస్.పి.శైలజ
నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 07.04.1989
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవ
నా కన్నుల్లో కన్నీళ్లు చిందవ
అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్ని తానైనాడు
తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
మా అమ్మలాంటి అన్న ఈ లోకాన లేడు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
ఆరు ఏడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్ని పండగ
తేవాలి బంగారు ఊయల .. కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా .. పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా .. నీ పాపకు జోల పాడనా
ఇది అరుదైన ఒక అన్న కధ
ఇది మురిపాల ఒక చెల్లి కధ
ఇది చెల్లెలే కాదులే నను కన్నా తల్లి
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు