చిత్రం: ముద్దుల మేనల్లుడు (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 07.07.1990
ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ఎప్పుడమ్మా ఓ చిలకమ్మ
ముద్దులన్నీ పండే దేపుడెమ్మా
ముత్యాల పందిరిలో
మురిపాల సందడిలో
మూడు ముళ్ళ మూర్తం ముందుంది ఓ చిన్నమ్మ
ముత్తైడు భాగ్యాలిస్తుంది
ఇది మొదలె నమ్మ
ముందు కధ ఉందో యమ్మ
తొలి రేయి లోన
దొర వయసు వాయనాలు ఇవ్వాలమ్మ
చరణం: 1
పసుపు పారాణి
బొట్టు కాటుక దిద్దిన నా రాణి నాకె కానుక
మమతే మంత్రముగా మనసే సాక్షి గా
మాటే మనుగదగా మనమే పాటగా
సాగాలి జీవితము
చెప్పాలి స్వాగతము
నిండు నూరేళ్ళ మనువుగా
రాగాల శృంగారం
గారాల సంసారం
పండే వెయ్యేళ్లు మనవిగా
బుగ్గన చుక్కా వచ్చెనే సిగ్గుల మొగ్గ విచ్చెనే
ఈ నిగ్గే పగ్గ మేసి నెగ్గేణమ్మ లగ్గ మంటూ
చరణం: 2
తేనె కు తీయదనం
తెలిపే ముద్దులో వయశుకు వేచదనం తెలిసే పొద్దులో
కలలకు కమ్మదనం కలిగే రేయి లో
వలపుల మూల ధనం పెరిగే హాయిలో
అందాల వెల్లువలో
వందేళ్ళ పల్లవులే
పాడే పరువాలే తోడుగా
వెయ్యాలి కూడికలు
వెయ్యేళ్ల వేడుకలు
వేడిగా విరహాలె వీడగా
గాజుల వీణ మీటగా
జాజుల వాన చాటగా
ఈ కొంగు కొంగు కూడే రంగ రంగ వైభవం గా
******** ********* *********
చిత్రం: ముద్దుల మేనల్లుడు (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్.పి.బాలు, చిత్ర
టాటా చెప్పాలోయి ఆటలు పాటలు నేర్చిన నిన్నాటికీ
వెల్‌కమ్ అందామోయి వెచ్చని ఆశలు రేపె రేపటికీ
చరణం: 1
కాలేజ్ గ్ల్యామర్ కు టీనేజ్ గ్ల్యామర్ ని
కలబోసి సిలబస్ గా చదవలేదా
మన ముందు బెంచీ సుందరాంగి
అందమంత కందిపోగా
జ్యాకెట్ పై రాకెట్ లు వెయ్యాలేదా ఆ బ్యూటీ కి స్వీట్ రూట్ వెయ్యాలేదా
బీటు వేసి హార్ట్ సైట్ కొట్టలెదా
అదెన్ది గురువా నా మంద లినవా
దానమ్మ బడావా నా లవ్ గొడవ
ఊద్నె ఉంద్ల నువ్వు చెప్పబళ్ళ
నీ అయ్య చూసే నీ తాట తీసే
చరణం: 2
ఎక్కడైనా లిప్స్ తోటి ఎక్సలెంట్ అందాలు
సెక్స్ తోటి మిక్స్ చేసి చూడలేదా
మనం టెక్స్ట్ బుక్స్ మధ్య పెట్టి సెక్స్ బుక్స్ చదువుతుంటే పట్టు కున్నా మాస్టరి
పని పట్టా లేదా
మార్చి మార్చి పరీక్షలు రాయలేదా
ఫైల్ అయ్‌టిహే కమ్ సెప్టెంబర్ పాడ లేదా
పరీక్ష రాస్తీ పరేషన్ అయితే
ఫరక్‌కు పడితే పదర పైకి
కాపీ కొదితివి నీకేమి ఫికారా
నెనేదా కొదితి వాడి చేత బడితి
చరణం: 3
కాలేజ్ ఎన్నికల్లు కిడ్నాపు లు
కొట్లాటలు గుర్తు కెద
ఆటల్లో పాటల్లో పోటీలే మర్చిపోయి
చక్కగా ఒక్కటిగా తిరగలేదా
బతుకు చదువు పాటా లు నేర్చుకుందాం
మలీ ఎప్పుడో ఎక్కడో కలుసుకుందాం
చెదరని బెదరని చెలిమే మనది
చెరగని తరగని స్నేహం మనది
జీవితమంతా విడదీయలేని
వాడని వీడని బంధం మనది