చిత్రం: ముద్దుల మొగుడు (1983)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్. పి.బాలు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, సుహాసిని, యస్.వరలక్ష్మి
దర్శకత్వం: కె.యస్.ప్రకాష్ రావు
నిర్మాత: చెరుకూరి ప్రకాష్ రావు
విడుదల తేది: 27.01.1983
పల్లవి:
ఎంత వింత ప్రేమ ఇది
ఎంత మంది బాధ ఇది
ఎంత వింత ప్రేమ ఇది
ఎంత మంది భాద ఇది
సర్వం నీదేనంటుంది
సర్వం నీదేనంటుంది
ఆ నీవు సర్వం నాదంటుంది
ఎంత వింత ప్రేమ ఇది
ఎంత మంది బాధ ఇది
చరణం: 1
నీవు ఉందేవరకు నీ నీడ ఉంటుంది
నీవు ఉందేవరకు నీ నీడ ఉంటుంది
నిన్ను నీకు గుర్తు చేస్తూ తరముతుంటుంది
తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు
తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు
మరువలేని మనసు లోతులు తిరగదోడక మానవు
ఎంత వింత ప్రేమ ఇది
ఎంత మంది బాధ ఇది
ఎంత వింత ప్రేమ ఇది
చరణం: 2
అడుకుందుకు బొమ్మనిమ్మని బోరుపెడుతుంది
అడుకుందుకు బొమ్మనిమ్మని బోరుపెడుతుంది
ఇవ్వగానే అదో ఆటగా
ఇవ్వగానే అదో ఆటగా పగలగొడుతుంది
ముక్కలన్ని అతికి బొమ్మను చేయమంటుంది
పాప వంటిది పిచ్చి ప్రేమ
పసిపాప వంటిది పిచ్చి ప్రేమ నవ్వువస్తుంది
ఎంత మంది భాద ఇది
సర్వం నీదేనంటుంది
సర్వం నీదేనంటుంది
ఆ నీవు సర్వం నాదంటుంది
ఎంత వింత ప్రేమ ఇది
ఎంత మంది బాధ ఇది
ఎంత వింత ప్రేమ ఇది