నీ పూల పైటలో మురిపాల తోటలో… లిరిక్స్
చిత్రం: ముగ్గురు మిత్రులు (1985)
నటీనటులు: శోభన్ బాబు, మురళీ మోహన్, చంద్ర మోహన్, సుహాసిని, సుమలత, తులసి
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలు, పి. సుశీల
దర్శకత్వం: రాజా చంద్ర
నిర్మాణం : మాగంటి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 19.07.1985
నీ పూల పైటలో మురిపాల తోటలో
తలతల నీ అందం తారలకే పందెం
మిలమిల నీ రూపం వెన్నెలకే దీపం
వాలే నీలాకాశం నీ కోసం
ఈ పూల బాటలో నీ చూపు వేటలో
వెలిగిన నా అందం చెలిమికి శ్రీమంతం
వలచిన సాయంత్రం వయసుల సంగీతం
నవ్వే తారాహారం నీ కోసం
ఆమనిలోయల కోయిల గుమ్మ
ఏమనెనో చెలి విన్నావా
పెదవికి పెదవే ఇమ్మంది
ప్రేమకు పదవైపొమ్మంది
పాడే తొలకరి వీణ
వలపులు జల్లే
పరిమళ గానాలలో…
వయ్యారంలా వల్లోకొచ్చి కలిసే వేళలో
తారతార నడుమాకాశం కరిగే నేలలో
నీ పూల పైటలో నీ చూపు వేటలో
తలతల నీ అందం తారలకే పందెం
వలచిన సాయంత్రం వయసుల సంగీతం
వాలే నీలాకాశం నీ కోసం
వేసవిలో నడి రాతిరి వేళ
ఏమనెనో చలి విన్నావా
మల్లెల మంటలు రేపింది
మెత్తగ హత్తుకు పొమ్మంది
నాలో సన సన జాజి
చినుకులు రాలే
సొగసరి నాట్యాలలో…
శృంగారంగ సిగ్గుల పూలు విసిరే వేళలో
నీకు నాకు సాయంత్రాలే పెరిగే మేళలో
ఈ పూల బాటలో మురిపాల తోటలో
వెలిగిన నా అందం చెలిమికి శ్రీమంతం
మిలమిల నీ రూపం వెన్నెలకే దీపం
నవ్వే తారాహారం నీ కోసం
thank you for giving lirics