చిత్రం: ముహూర్తబలం (1969)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: పి.సుశీల
నటీనటులు: కృష్ణ , నాగభూషణం, జమున, విజయ నిర్మల
దర్శకత్వం: ఎమ్.మల్లికార్జున రావు
నిర్మాతలు: వై.వి.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద రావు, ఎమ్.వి.రామదాసు
విడుదల తేది: 13.06.1969
డోయ్ డోయ్ డోయ్ డోయ్ వస్తున్నాడోయ్
వస్తున్నాడోయ్ దిగి వస్తున్నాడోయ్
పైలా పచ్చిసు వయసున్నవాడు
పగడాల జిగివున్న ఓ వన్నెకాడు
పల్లేరు గాయాలు గుచ్చుకుంటాయి
కాళ్లు పదిలామంటే వింటాడో
వాలుచుపులు ఉచ్చుకుంటాయి
వరుస తెలుసుకోమంటే ఏమంటాడో
ఎర్రగా బుర్రగా ఉన్నాడు
ఎంచక్కా షోకు చేసుకున్నాడు
ఎవ్వరికైనా మనసిచ్చాడో
ఇవ్వలేకనే తిరిగొచ్చాడో
జొన్నచేలకే షికారు పోతాడో
కన్నెగాలికే కంగారు పడతాడో
మస్తు మస్తుగా ఊళ్ళో ఉంటాడో
బస్తీకి తిరిగి ఎగిరిపోతాడో