చిత్రం: మురళి కృష్ణుడు (1988)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) (All)
గానం: యస్.పి.బాలు , పి.సుశీల
నటీనటులు: నాగార్జున , మోహన్ బాబు, రజిని
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 31.05.1988
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
మెరిసేనమ్మ జాబిలి కూన కురిసేనమ్మ జాజుల వాన
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
పెళ్ళికి లగ్గం పెట్టాలంటా పందిట మేలం కొట్టలంట
గట్టు దాటిందమ్మ వయసూ
పట్టు తప్పిందమ్మ మనసూ
ముల్లు గుచ్చిందమ్మ ఈడు
వొల్లు వేడెక్కింది చూడు
అసలే చలి ముసిరే చెలి కొసరే వల విసిరే
అసలే చలి ముసిరే చెలి కొసరే వల విసిరే
ఈ అద్దల చెక్కిల్లు ముద్దాడుకోన మరీ
నా మోజంత రాజేసి కాజేసి పోకొయ్ సిరీ
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
ఆరడి పెట్టిందమ్మ హాయి
గారడి చేసిందమ్మ రేయీ
సోకుల తాకిది లోన దాహం
రేకులు విచ్చేనమ్మ తాపం
విరిసే తొలి వయసే జత కలిసే కథ తెలిసే
విరిసే తొలి వయసే జత కలిసే కథ తెలిసే
ఇక ఉయ్యాల ఊగించు వయ్యరి సయ్యాటలో
మరి పరదాలు తొలగించు పరదాల సందిల్లలో
చక్కని చిలకమ్మా నా పక్కకు రావమ్మ
వెచ్చటి గోరింకా ఈ ముచ్చట చాలింకా
మెరిసేనమ్మ జాబిలి కూన కురిసేనమ్మ జాజుల వాన
******* ******* *******
చిత్రం: మురళి కృష్ణుడు (1988)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) (All)
గానం: యస్.పి.బాలు
నా కోసమే లోకం పుట్టీంది
ఆకాశమే హారతి పట్టింది
మురిపాలన్ని నా ముంగిట్లో
సరసాలన్ని నా సందిట్లో
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
come come welcome స్వాగతం
యవ్వనం నీటి బుడగా
జీవితం గాలి పడ్గా common
ఉండేది మూన్నల్లూ చేసుకో తిరునాల్లు
enjoy i say
కదిలే కాలం కరిగే పరువం ఆగవులే
ఉరికే ఊహలు ఉబికే ఊహలు దాగవులే
నువ్వు అనుకుంది ఆపెయ్యకూ
మనసయ్యింది మానేయకూ
యేది యేమైన పద ముందుకు
యెవ్వరేమన్న మంకెందుకూ
don’t care అన్నడో ప్రేమనగర్ సామ్రట్
నా కోసమే లోకం పుట్టీంది
ఆకాశమే హారతి పట్టింది
అరచెతిలో స్వర్గం అందుకో ప్రతి నిత్యం
అనుభవమే సత్యం అదే మన వేదాంతం
అందని దానికి ఊరక దేనికి ఆరాటం
తెగబదకుంటె తీరదిరా నీ ఉబలాటం
నువ్వు అడుగేసి వెనకెయ్యకూ
చేతికందింది వదిలెయ్యకూ
నిన్న జరిగింది తలపోయకూ
రేపు జరిగేది మనకెందుకూ
don’t care అంటున్నడు ఈ ప్రేమ పూజారి
నా కోసమే లోకం పుట్టీంది
ఆకాశమే హారతి పట్టింది
మురిపాలన్ని నా ముంగిట్లో
సరసాలన్ని నా సందిట్లో
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
సరి ఈడు గుమ్మల్లరా
నాతో సరదాగా అడుగేస్తరా
really great job sir ji..thanks a lot’s
Thanks for compliment sir