మురిపాల వన్నెల రాధా… లిరిక్స్
సంగీతం: రామ్ సురేందర్
సాహిత్యం: పొందూరి
గానం: ప్రియాంక
దర్శకత్వం: ఉదయసంకరన్
నిర్మాణం: ఎం.సి.సజితన్
విడుదల తేది: 06.07.2013
మురిపాల వన్నెల రాధా..
మదిలోని వెన్నెల రాధా..
మురిపాల వన్నెల రాధా..
మదిలోని వెన్నెల రాధా..
కన్నయ్య మనసే నీది కాదటే..
దేనికి అలుకలు చాలును
కృష్ణుని వలపులు గ్రోలుము
పిల్లన గ్రోవు విందులు చేయు అల్లరి దానవే..
పిల్లన గ్రోవు విందులు చేయు అల్లరి దానవే..
రాధా.. మాధవ బృందావనము నీవే రాధికా..
మురిపాల వన్నెల రాధా..
మదిలోని వెన్నెల రాధా..
కన్నయ్య మనసే నీది కాదటే..
సుందర వదనా.. సుమతుల సతన ముందుకు రారావే..
వెన్నుని గుండెల వేణువులూరెడు మోహన రాణినీవే..
యమునా తీరం వెన్నల విరహం వేచెను మనకోసం
యమునా తీరం వెన్నల విరహం వేచెను మనకోసం
రాధా.. మాధవ సల్లాపాలు సంధ్యారాగాలు..
మురిపాల వన్నెల రాధా..
మదిలోని వెన్నెల రాధా..
కన్నయ్య మనసే నీది కాదటే..
బృందావనము అది అందరిదీ.. అని ఎరుగని దానివటే..
రాధా.. కృష్ణుడు అల్లరి వాడని తెలియని దానివటే..
మురళీ.. మోహన హృదయాలాపన నీకే వినపడదా..
మురళీ.. మోహన హృదయాలాపన నీకే వినపడదా..
రాధా.. మాధవ సంగమ యోగం రాసక్రీడలులే..
మురిపాల వన్నెల రాధా..
మదిలోని వెన్నెల రాధా..
మురిపాల వన్నెల రాధా..
మదిలోని వెన్నెల రాధా..
కన్నయ్య మనసే నీది కాదటే..
దేనికి అలుకలు చాలును
కృష్ణుని వలపులు గ్రోలుము
పిల్లన గ్రోవు విందులు చేయు అల్లరి దానవే..
పిల్లన గ్రోవు విందులు చేయు అల్లరి దానవే..
రాధా.. మాధవ బృందావనము నీవే రాధికా..
మురిపాల వన్నెల రాధా..
మదిలోని వెన్నెల రాధా..
కన్నయ్య మనసే నీది కాదటే..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
Thank you so much.