తెల్లావారకముందే.. పల్లె లేచిందీ… లిరిక్స్
చిత్రం : ముత్యాల పల్లకి (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం: మల్లెమాల
గానం: పి. సుశీల
నటీనటులు: నారాయణ రావు , జయసుధ
దర్శకత్వం: బివి ప్రసాద్
నిర్మాణం: —-
విడుదల తేది: 12.01.1977
తెల్లావారకముందే.. పల్లె లేచిందీ..
తనవారినందరినీ.. తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కొంది అదేపనిగ కూసింది
తెల్లావారకముందే.. పల్లె లేచిందీ..
తనవారినందరినీ.. తట్టీ లేపింది
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో..
పక్కదులుపుకొని ఒకే.. పరుగుతీసింది
అది చూసి… లతలన్నీ…
ఫక్కున నవ్వాయి ఆ నవ్వులే..
ఇంటింట పువ్వులైనాయి
తెల్లావారకముందే.. పల్లె లేచిందీ..
తనవారినందరినీ.. తట్టీ లేపింది
పాలవెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లెపూల రాశివంటి మమతలు.. ఊ..
పల్లెసీమలో.. కోకొల్లలు..
అనురాగం…
అభిమానం…
అనురాగం.. అభిమానం.. కవలపిల్లలు
ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు.. ఊ..
తెల్లావారకముందే.. పల్లె లేచిందీ..
తనవారినందరినీ.. తట్టీ లేపింది
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ… లిరిక్స్
చిత్రం : ముత్యాల పల్లకి (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం: మల్లెమాల
గానం: ఎస్.పి.బాలు, పి. సుశీల
నటీనటులు: నారాయణ రావు , జయసుధ
దర్శకత్వం: బివి ప్రసాద్
నిర్మాణం: —-
విడుదల తేది: 12.01.1977
సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..
మాటా మంతి లేని వేణువు పాట పాడింది..
సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..
మాటా మంతి లేని వేణువు పాట పాడింది..
హా హ హా..ఆ హ హా..
గున్నమావికి సన్నజాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది..
గున్నమావికి సన్నజాజికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది..
ఆహా ఆహా..ఓహో..ఒహో..
పూసే..వసంతాలు మాకళ్ళలో..
పూసే..తలంబ్రాలు మా పెళ్ళిలో..
పూసే..వసంతాలు మాకళ్ళలో..
పూసే..తలంబ్రాలు మా పెళ్ళిలో..
విరికొమ్మా..చిరురెమ్మా.
విరికొమ్మా..చిరురెమ్మా.
పేరంటానికి రారమ్మా
సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..
మాటా మంతి లేని వేణువు పాట పాడిందీ..
హా హ హా..ఆ హ హా..
కలలే..నిజలయే ఈనాటికీ..
అలలే..స్వరాలాయే మా పాటకీ
కలలే..నిజలయే ఈనాటికీ..
అలలే..స్వరాలాయే మా పాటకీ
శ్రీరస్తూ..శుభమస్తూ..
శ్రీరస్తూ..శుభమస్తూ..
అని మీరు మీరు దీవించాలి..
సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీలత నాట్యమాడింది..
సన్నజాజికి గున్నమావికి పెళ్ళి కుదిరిందీ..
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****