చిత్రం: మువ్వ గోపాలుడు (1987)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి. నారాయణరెడ్డి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల (All)
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి, శోభన
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్. గోపాల్ రెడ్డి
విడుదల తేది: 19.05.1987
పల్లవి:
అందగాడా నిండు చందురూడా
ఈ సందెకాడ రారా ముద్దులాడ
చేను పచ్చన మేను వెచ్చనా
గాలి చల్లన గుండె జల్లన
చేను పచ్చన నా మేను వెచ్చనా
ఈ గాలి చల్లన నా గుండె జల్లన
చరణం: 1
పైడి బొమ్మా పగడాల రెమ్మా
ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా
కంచెపట్టు చీరకట్టి కాళ్లకు పారని పెట్టి
కలవాణి రావే
బుగ్గమీద చుక్కపెట్టి సిగ్గులన్ని మూతకట్టి
అలివేణి రావే
కంచెపట్టు చీరకట్టి కాళ్లకు పారని పెట్టి
కలవాణి రావే
బుగ్గమీద చుక్కపెట్టి సిగ్గులన్ని మూటకట్టి
అలివేణి రావే
కులుకులొలుకు కుందరదన చిలకపలుకు ఇందువదన
గల గల సాగిరావే
ఫాల్గుణ మాసం పంచమి లగ్నం
పచ్చల పందిట ముచ్చట తీరగ
పరిణయ మాడుతానే
అందగాడా నిండు చందురూడా
ఈ సందెకాడ రారా ముద్దులాడ
చరణం: 2
పసిడి అంచు పంచికట్టి పరువమంత పదును పెట్టి
పక్కనున్న ప్రణయ సుందరా
మౌన వీణ మీటి మీటి మన్మధున్ని దాటి దాటి
మధురిమ లిచ్చిపోరా
పసిడి అంచు పంచికట్టి పరువమంత పదును పెట్టి
పక్కనున్న ప్రణయ సుందరా
మౌన వీణ మీటి మీటి మన్మధున్ని దాటి దాటి
మధురిమ లిచ్చిపోరా
బిడియ పడక బెదిరి పడక
తుళ్ళి పడక పూలపడక అల్లన చేరుకోవే
కిన్నెర లోకం అంచులు చూసి
మన్మధ లోకం లోతులు తీసి
కిల కిల నవ్వుదామే
పైడి బొమ్మా పగడాల రెమ్మా
ముత్యాల కొమ్మా రావే ముద్దుగుమ్మా
రారా ముద్దులాడ
రావే ముద్దుగుమ్మా