Naa Ishtam (2012)

చిత్రం: నా ఇష్టం (2012)
సంగీతం: చక్రి
సాహిత్యం: చంద్రబోస్
గానం: కునాల్ గంజావాల
నటీనటులు: దగ్గుబాటి రాణా , జెనీలియా
దర్శకత్వం: ప్రకాష్ తోలేటి
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేది: 23.03.2012

నా ఇష్టం లేకుండానే పుట్టా నేనే
నా ఇష్టం లేకుండానే పోతానేనే
నా ఇష్టం లేకుండానే పుట్టా నేనే
నా ఇష్టం లేకుండానే పోతానేనే
నడిమధ్యలో అంత నా ఇష్టమే
నా ఇష్టంగా నేను బ్రతికేస్తానే
లేస్తా నాకై నేనే అడుగేస్తా నాకై నేనే
ముందు వెనకా నేనే నా చుట్టూ పక్కా నేనే
స్వార్ధానికర్ధం నేనే

ఎస్ నే చెబుతా లైస్ ఎస్ నే చేస్తా ఐస్
ఎస్ ఇది సెల్ఫిష్నెస్ ఓ…
ఎస్ నచ్చేది క్యాష్ ఎస్ నచ్చందె లాస్

తనకొరకె తను సంపాదించెను డబ్బులు అంబాని
తన మనుగడకై పరుగులు పెట్టెను టెండర్ దర్గాని
తన సంతోషము తను కోరి ఎవరెస్టెక్కెను డెన్సింగే
తన ఆనందం తను కోరి చంద్రుని చేరెను ఆమ్ స్ట్రాంగే
ప్రతివాడిలో ఉంది తన స్వార్ధమే
స్వార్ధం అంటే తనకోసం తానే
స్వార్ధం ఉంటే అది నేరం కాదే
బ్రతికేందుకది మూలమే

ఎస్ ఇది బ్రేకింగ్ న్యూస్, ఎస్ ఇది డ్రైవింగ్ ట్రాస్
ఎస్ ఇది సెల్ఫిష్ నెస్
ఎస్ ఇది నా ఫైట్ నెస్, ఎస్ ఇది నా వీక్నెస్
ఎస్ ఇది సెల్ఫిష్ నెస్

అమ్మా నాన్న స్వార్ధాన్ని అనురాగం అంటారే
ప్రేయసి ప్రియుల స్వార్థాన్నే పొజసివ్నెస్ అంటారే
ఎగ్జామ్స్ లో  స్వార్ధాన్నే కాన్సంట్రేషన్ అంటారే
క్రీడాకారుల స్వార్ధాన్నే డెడికేషన్ అంటారే
మాటేదైన కానీ మార్గం ఇదే
స్వార్ధం ఉంది మన ఊపిర్లో
స్వార్ధం లేని ఎదచప్పుడు లేదే
చెడు కాదు ఇది సుగుణమే

ఎస్ ఇది లైఫ్ కు బేస్ న్యూస్ ఎస్ ఇది లోపలి ఫేస్
ఎస్ ఇది సెల్ఫిష్ నెస్   ఓ…
ఎస్ ఇది నేనే నా బాస్ ఎస్ నేనే
ఎస్ ఇది సెల్ఫిష్ నెస్   ఓ…

********   ********   ********

చిత్రం: నా ఇష్టం (2012)
సంగీతం: చక్రి
సాహిత్యం: బాలాజీ
గానం: కె.కె.

ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా
ఓ నా ప్రియా ఓ నా ప్రియా  నా నుండి నే విడిపోయా
ఒక నువ్వు ఒక నేను ఒకటైతే కద ప్రేమ
ఒక చోట అనుకుంటే మన ఇద్దరి చిరునామా

ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా
ఓ నా ప్రియా ఓ నా ప్రియా  నా నుండి నే విడిపోయా

నా మనసంతా చెరిపి నీ రూపే గీశావే
నీ బరువే మోపి నను తేలిక చేశావే
నా మనసంతా చెరిపి నీ రూపే గీశావే
నీ బరువే మోపి నను తేలిక చేశావే

నీ శకునం కోసం చూసే
ప్రతి సేకనుకు నిమసాలెన్నో
నీ హృదయం కోసం వేసే
ప్రతి అడుగున దూరాలెన్నో
కంటి రెప్పే ఇప్పుడు చెయ్యలేదు చప్పుడు
నిను చూడనప్పుడు సూటిగా
దూరముంటే అమ్మలా దగ్గరుంటే బొమ్మలా
గంటకొక్క జన్మలా ఉందిగా

ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా
ఓ నా ప్రియా ఓ నా ప్రియా  నా నుండి నే విడిపోయా

నా తనువంతా నవ్వై తలకిందులు అయ్యానే
జ్ఞాపకమే నవ్వై జీవితమే మరిచానే
నా తనువంతా నవ్వై తలకిందులు అయ్యానే
జ్ఞాపకమే నవ్వై జీవితమే మరిచానే
నా గుండెల చప్పుడు కన్నా
నీ అలికిడితో బ్రతికున్నా
నను కాదని తెలిసిన సమయం
నా ఊపిరికెందుకు ప్రాణం
ప్రేమ తేనె పట్టని ఆశ పాముపుట్టని
ప్రేయసంటే అర్థం మారినా
వెంట పడ్డ నీడని అచ్చమైన నవ్వుని
వేలుపట్టి లోకమే దాటనా

ఓ సాతియా ఓ సాతియా ఓ చూపుకే పడిపోయా
ఓ నా ప్రియా ఓ నా ప్రియా  నా నుండి నే విడిపోయా
ఒక నువ్వు ఒక నేను ఒకటైతే కద ప్రేమ
ఒక చోట అనుకుంటే మన ఇద్దరి చిరునామా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Laali Patalu
Chittikoona Chittikoona Song Lyrics
error: Content is protected !!