చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ – శేఖర్
నటీనటులు: అల్లు అర్జున్, అనుఇమాన్యుయేల్ , అర్జున్ సార్జా
కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వక్కంతం వంశీ
నిర్మాణం: శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసు, కె.నాగబాబు
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
విడుదల తేది: 27.04.2018
ఓ సైనిక… లిరిక్స్
చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ – శేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: విశాల్ దద్లాని
సరిహద్దున నువ్వు లేకుంటే
ఏ కనుపాప కంటినిండుగా
నిదురపోదురా నిదురపోదురా
నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే
జాతి భావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా
ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా
సెలవే లేని సేవక ఓ సైనిక
పనిలో పరుగే తీరిక ఓ సైనిక
ప్రాణం అంత తేలిక ఓ సైనిక
పోరాటం నీకో వేడుక ఓ సైనిక
దేహంతో వెలిపోదే కథ
దేశంలా మిగులుతుందిగా
సమరం ఒడిలో నీ మరణం
సమయం తలచే సంస్మరణం
చరితగ చదివే తరములకు
నువ్వో స్పూర్తి సంతకం
పస్తులు లెక్కపెట్టవే ఓ సైనిక
పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక
గస్తీ దుస్తులు సాక్షిగా ఓ సైనిక
ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక
బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు
ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు
తెగువగు ధీరుడివని బలమగు భక్తుడనే
వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది
నీ శక్తిని నమ్మింది
ఇల్లే ఇండియా దిల్లే ఇండియా
నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా
నువ్వో మండే భాస్వరం ఓ సైనిక
జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక
బ్రతుకే వందేమాతరం ఓ సైనిక
నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
I Am Lover Also Fighter Also… లిరిక్స్
చిత్రం: నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ – శేఖర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శేఖర్ రవ్జియాని
అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే
అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే
చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే
గురిపెడుతూ చూపులతోనా నువు పేల్చకె బొమ్మ తుపాకీ
సరిహద్దులు తెంచుకురానా నే నీ జిందగీలోకీ
i am lover also fighter also
i am lover also fighter also
lover also fighter also
నొ సెప్పి కూర్చున్న నీ హార్టు బుక్కు పై
love story మల్లి రాసె writer also
i am lover also fighter also
ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా
ఏం చేశావని వేలెత్తి చూపుతావు సూటిగా
చలో చలో చలో చెరో సగం తప్పుగా
మరో కతై కలుద్దామ కొత్తగా
flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో
patchup అవదానికెంత చాన్సో
i am lover also fighter also
ఆ ఇను ఇనవే హేయ్ హేయ్ మాట వినవే మంచి పిల్లవే
సిన్న గొడవే హేయ్ హేయ్ సన్న గొడవే సల్ల బడవే
బెదిరింపులు తెగదెంపులుగా ఎల్లిపోకే break up లోకీ
గడియేసిన తలుపులు తీసి తిరిగొస్తా నీలోకీ
i am lover also fighter also
i am lover also fighter also
lover also fighter also
సీకట్లొ దాక్కున్న నీలోని ప్రేమని
పట్టుబట్టి బయటపెట్టె lighter also
i am lover also fighter
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
బ్యూటిఫుల్ లవ్… లిరిక్స్
చిత్రం: నాపేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ శేఖర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి
పెదవులు దాటని పదం పదంలో
కనులలొ దాగని నిరీక్షణంలో
నాతో ఏదో అన్నావా
తెగి తెగి పలికె స్వరం స్వరంలో
తెలుపక తెలిపే అయోమయంలో
నాలో మౌనం విన్నావా
నాలానే నువ్వూ ఉన్నావా
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
ఏమైంది ఇంతలో నా గుండె లోతులో
ఎన్నడూ లేనిదీ కలవరం
కనుబొమ్మ విల్లుతో విసిరావొ ఏమిటో
సూటిగా నాటగా సుమశరం
తగిలిన తీయనైన గాయం
పలికిన హాయి కూని రాగం
చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదొ
ఏం జరగనుందో ఏమో ఈపైనా
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్
నిగనిగలాడెను కణం కణం
నీ ఊపిరి తాకిన క్షణం క్షణంలో
నా తలపె వలపై మెరిసేలా
వెనకడుగేయక నిరంతరం
మన ప్రేమ ప్రవాహం మనోహరం
ప్రతి మలుపూ గెలుపై పిలిచేలా
బావుంది నీతో ఈ ప్రయాణం
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
మన కథ బ్యూటిఫుల్ లవ్
పద పద ఫైండ్ ద మీనింగ్
లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****