చిత్రం: నా పిలుపే ప్రభంజనం (1986)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం:
గానం:
నటీనటులు: కృష్ణ , కీర్తి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రావు
నిర్మాత: ఎ. ఆది శేషగిరిరావు
విడుదల తేది: 1986
నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం
నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం
నా ధ్యేయం ప్రజా క్షేమం నా పిలుపే ప్రభంజనం
నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం
కుల మతాలులేనిదే నా ప్రియ దేశం
మమత మమత పెంచడమే నా సందేశం
జాతి సమైక్యత చాటడమే నా గీతం
సమ సమాజ సంపాదనయే నా సంకేతం
యువతకు ఉత్సాహాన్నిరా
మా నవతకు ప్రోత్సాహాన్నిరా
నా పిలుపే ప్రభంజనం
నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం
నా ధ్యేయం ప్రజా క్షేమం నా పిలుపే ప్రభంజనం
చీకటితో పోరాటం నా శాంతం
బొంకే నాల్కల చీల్చేదే నా చక్రం
భస్మషురులను హతమార్చేందుకె నా అస్త్రం
బలహీనులని కాపాడేందుకే నా హస్తం
మంచికి నే కొడుకునురా ప్రగతికే పచ్చబొట్టునురా
నా పిలుపే ప్రభంజనం
నా పేరే సాహసం నా ఊపిరి సమధర్మం
నా ధ్యేయం ప్రజా క్షేమం నా పిలుపే ప్రభంజనం