అనితా … ఓ.. వనిత… లిరిక్స్
సంగీతం: రవి కళ్యాణ్
సాహిత్యం: గుణిపార్తి నాగరాజు
గానం: గుణిపార్తి నాగరాజు
నటీనటులు: ఎమ్మిగనూరు కోటేంద్ర,సుగుణ
నాప్రాణమా.. నను వీడిపోకుమా..
నీప్రేమలో.. నను కరగనీకుమా..
పదేపదే నామనసే.. నిన్నే కలవరిస్తుంది
వద్దన్నా వినకుండా.. నిన్నే కోరుకుంటోంది
అనితా… అనితా … అనితా … ఓ.. వనిత
నా.. అందమైన అనితా..
దయలేదా కాస్తైనా.. నా పేద ప్రేమపైన
నాప్రాణమా.. నను వీడిపోకుమా..
నీప్రేమలో.. నను కరగనీకుమా..
నమ్మవుగా చెలియ, నే నిజమే చెబుతున్నా..
నీ ప్రేమ అనే పంజరాన, చిక్కుకొని పడి ఉన్నా..
కలలో కూడా నీరూపం, నను కలవరపరిచెనే..
కనుపాప నిన్ను చూడాలని, కన్నీరే పెట్టెనే..
నువ్వొక చోటా.. నేనొక చోటా..
నిను చూడకుండ, నే క్షణముండలేనుగా..
నా పాటకి ప్రాణం నీవే.. నా రేపటి స్వప్నం నీవే..
నా ఆశల రాణివి నీవే.. నా గుండెకి గాయం చేయకే…
అనితా… అనితా … అనితా … ఓ.. వనిత
నా.. అందమైన అనితా..
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమపైన
నాప్రాణమా.. నను వీడిపోకుమా..
నీప్రేమలో.. నను కరగనీకుమా..
నువ్వే నాదేవతవని యెదలొ కొలువుంచా..
ప్రతిక్షణము ధ్యానిస్తు పసిపాపలా చూస్తా..
విసుగురాని నాప్రాణం నీపలుకుకై ఎదురుచూసే..
నిన్ను పొందని ఈ జన్మే నాకెందుకనంటుందే..
కరుణిస్తావో కాటేస్తావో, నువ్వు కాదని అంటే..
నే.. శిలనవుతానే..
నన్ను వీడని నీడవు నీవే.. ప్రతిజన్మకు తోడునీవే..
నా కమ్మనీ కలలు కూల్చి , నను ఒంటరి వాడ్ని చెయ్యకే..
అనితా… అనితా … అనితా … ఓ.. వనిత
నా.. అందమైన అనితా..
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమపైన
నాప్రాణమా.. నను వీడిపోకుమా..
నీప్రేమలో.. నను కరగనీకుమా..
పదేపదే నామనసే.. నిన్నే కలవరిస్తుంది
వద్దన్నా వినకుండా.. నిన్నే కోరుకుంటోంది
అనితా… అనితా … అనితా … ఓ.. వనిత
నా.. అందమైన అనితా..
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమపైన
ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే..
ఒక చిన్ని ఆశ నాలో, చచ్చేంత ప్రేమ మదిలో..
ఎవరు ఏమనుకున్నా.. కాలమే కాదన్నా..
ఎవరు ఏమనుకున్నా.. కాలమే కాదన్నా..
ఒట్టేసి చెబుతున్నా.. నా ఊపిరి ఆగువరకు
నిను ప్రేమిస్తూనే ఉంటా…
అనితా… అనితా … అనితా … ఓ.. వనిత
నా.. అందమైన అనితా..
దయలేదా కాస్తైనా నా పేద ప్రేమపైన
***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****
super