Naalo Unna Prema (2001)

Advertisements

చిత్రం: నాలోవున్నప్రేమ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సుజాత
నటీనటులు: జగపతిబాబు, లయ, గజాల
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: కె.ఎల్.వి రాజు
విడుదల తేది: 01.09.2001

ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా..తెలుసా..
అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా
హౄదయం లో నిండిన నువ్వే..ఎదురైతే మాటలు రావే..
ఈ మౌనం ఇద్దరిమధ్యా ఇంకా ఎన్నాళ్ళూ..

ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా..తెలుసా..
అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా !

నిను చేరే తొందరలో వద్దన్నా వినదు కదా..
పడిపోదా ఎగిరే కన్నె ఎదా
పదిలం గా అందుకునీ గుండెలలో దాచుకొనే..
ప్రియ నేస్తం నేనున్నాను కదా

అది నిజమైనా అనలేదు నాతో
అసలెపుడైనా అడిగావ నన్నూ

అడగాలని అనుకుంటూ ఉన్నా..
అడుగెందుకు ముందుకు పడదో ఏమో !

ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా..
ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా..

పెదవుల్లో అల్లరిగా తుళ్ళిపడే మువ్వలయే ..
చిరునవ్వుల సందడి నీ తలపే
ఓ .. ఓ .. ఓ .. నడి రాతిరి నిద్దురలో
నా కలనే నడిపించే..సిరివెన్నెల స్నేహం నీ పిలుపే

Advertisements

తలపులలోనే నువు దాగిపోకు
మెలకువ రాని కలలెంత సేపూ

నీ మనసును చదవాలనుకున్నా..
వినకూడని బదులిస్తుందో ఏమో !

ఎన్నో ఎన్నో చెప్పాలనుకున్నా..తెలుసా..
అలలై ఎగసే ప్రియ భావాలు తెలిపేదెలా
హౄదయం లో నిండిన నువ్వే..ఎదురైతే మాటలు రావే..
ఈ మౌనం ఇద్దరిమధ్యా ఇంకా ఎన్నాళ్ళూ..

*********   **********   *********

చిత్రం: నాలోవున్నప్రేమ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: శ్రీహర్ష
గానం: చిత్ర

మనస ఓ మనసా ఇదిగొ మనస్సా ఇది నీ కధ తెలుసా
మనస ఓ మనసా ఇదిగొ మనస్సా ఇది నీ కధ తెలుసా
మనసు పెరుతొ ఇన్ని ఆటలా మనుషులందరు నీ ఆట బొమ్మలా
మనసంటె నువ్వన్నవు నీకు అసలు మనసు వున్నదా
మనిషి రొద మమత వ్యధ నీకు పట్టదా.
మనసుపడితె గుట్టెంటి నిజం చెప్పవా.

ఈ మనసె థంది కాని మనసుపైన మనసు పడె దాహం
ఆ మనసె వదలమన్న వదలలేక మనసు చెడె మొహం
మనసె మరి ప్రతి మనసును చెయును మొసం
తన మనసె కొరుకున్న మమతల కొసం
ఈ మనసుల ఆట లొన న్యాయం వుందా
ఈ గాయం పాట తొటి నయమవుతుందా.
మనసుకి అర్ధం ఒకె ఒక స్వార్ధం
మరపె లెదు మనసుకి అనుక్షనం
కొతి మనసిది నాటి మనసిది
నెతి మనసిది రాతి మనసిది
కవ్వించె కొరికతొ ఎంతకైన చెరును మనసు
తన మనసుకు నచ్చిన పడి చచ్చును మనసు
తన వారి మనసునైన చంపును మనసు

ఈ మనసె కొటి కొక్క మనిషిలొన దీపపమల్లె వెలుగులె
ఆ మనసె పరుల కొరకు తనకు తను నిలువెల్లా కరుగులె
కన్నీళ్ళను చిందిస్తూ కరుణిస్తుంది
అనురాగం అందిస్తూ వరమిస్తుంది
ఇతరులకై బతికెస్తూ నవ్వెస్తుంది
భాధ అంత తాను పడుతు నవ్విస్తుంది
మనసె రాగం శ్రుతి లయ గీతం
మనసె ప్రెమ పల్లవి చరణము
సుధల మనసిది మ్రుదుల మనసిది
తీగ మనసిది తీపి మనసిది
తన పర బెదమసలు చూడనట్టి గొప్పది మనసు
జగమంత తనలొనె కుర్పును మనసు
భగవంతుని కసలు మారు పెరె మనసు
మనస ఒహ్ మనసా
మనస మంచి మనసా
మనస పిచ్చి మనసా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Tulasi (2007)
error: Content is protected !!