• About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
Home Movie Albums

Nachavule (2008)

A A
0
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Pinterest

MoreLyrics

Baguntundhi Nuvvu Navvithe Song Lyrics in Telugu & English – Atithi Devo Bhava Movie Song

Brundhavanike Chindhulu Nerpe Song Lyrics

Veedhi (2006)

Nchhavule

చిత్రం: నచ్చావులే (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్
నటీనటులు: తనీష్  , మాధవీలత
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 12.12.2008

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా
ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా
ఎదురొచ్చే వాసంతం అవుతోందే నా సొంతం
ఎద నిండా ఆనందం నన్నే నన్నే ముంచేస్తోందే
oh..my love oh..my love
oh..my love my love ఓ..

చరణం: 1
వస్తావో రావో అంటూ సందేహంలో నేనున్నానే
కనిపించి మురిపించాక కంగారవుతున్నానే
నీ అందం పూలచెట్టు కాదా నీ పెదవే తేనె బొట్టు కాదా
నీ వయసే మాగ్నెట్టు లాగా నన్నే లాగుతోందే
నవ్వుల్లో సంధ్యారాగం ఈ రోజే వింటున్నా
ఎండల్లో శీతాకాలం నీ వల్లేగా అనుకుంటున్నా
oh..my love oh..my love
oh..my love my love ఓ..

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా

చరణం: 2
ఈ రోజే ఆకాశంలో హరివిల్లేదో కనిపించింది
తెలతెల్లని మబ్బుల్లోన ఎంతో ముద్దొస్తో౦దే
ఆ చూపే టార్చ్ లైట్ కాదా ఆ రూపం చాక్లెట్ కాదా
తన చుట్టూ శాటిలైట్టు లాగా మనసు తిరుగుతోందే
జాబిల్లే నేలకు వచ్చి నాముందే నిలిచిందా
అదృష్టం నన్నే మెచ్చి నిన్నే నాకు అందించిందా
oh..my love oh..my love
oh..my love my love ఓ..

ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా
ఏవేవో ఏవో ఏవో ఏవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్నా
ఎదురొచ్చే వాసంతం అవుతోందే నా సొంతం
ఎద నిండా ఆనందం నన్నే నన్నే ముంచేస్తోందే
oh..my love oh..my love
oh..my love my love ఓ..

********  ********  *********

చిత్రం: నచ్చావులే (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రంజిత్

పల్లవి:
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా
I am so sorry baby ఓ..ఓ..ఓ..
I am really sorry baby ఓ..ఓ..ఓ..
ఓ చెలీ పొరపాటుకి గుణపాఠమే ఇదా ఇదా
మౌనమే ఉరితాడులా విసిరెయ్యకే ఇలా ఇలా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా
మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా

చరణం:1
నా వల్ల జరిగింది తప్పు నేనేమి చెయ్యాలో చెప్పు
పగపట్టీ పామల్లే నువ్వు బుస కొట్టకే
కోపంగా కన్నెర్ర చేసి కారాలు మిరియాలు నూరి
ఏవేవో శాపాలు గట్రా పెట్టేయ్యకే
కాళ్ళా వేళ్ళా పడ్డా కూడా ఊరుకోవా
కుయ్యో మొర్రో అంటూ ఉన్నా అలక మానవా
అందం చందం అన్నీ ఉన్న సత్యభామా
పంతం పట్టి వేధించకే నన్నువిలా
ఓహో చెలీ చిరునవ్వులే కురిపించవా హోహో..
కాదని విదిలించకే బెదిరించకే ఇలా ఒహో

మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా

చరణం:2
అరగుండు చేయించుకుంటా బ్లేడెట్టి కోసేసుకుంటా
కొరడాతో కొట్టించుకుంటా క్షమించవే
కాదంటే గుంజీలు తీస్తా వొంగొంగి దండాలే పెడతా
నూటొక్క టెంకాయ కొడతా దయ చూపవే
గుండేల్లోన అంతో ఇంతో జాలే లేదా
ఉంటే గింటే ఒక్కసారి కనికరించవా
friendship అంటే అడపా దడపా గొడవే రాదా
sorry అన్నా సాధిస్తావే నన్నిలా
ఓ చెలీ ఎడబాటునే కలిగించకే ఇలా ఇలా
నన్నిలా ఏకాకిలా వదిలెళ్ళకే అలా అలా

మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా

********  ********  *********

చిత్రం: నచ్చావులే (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: గీతామాధురి

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావే.. ఓ..
నచ్చావే.. నచ్చావులే..

చరణం: 1
అనుకుని అనుకోగానే సరాసరి ఎదురవుతావు
వేరే పనేం లేదా నీకు నన్నే వదలవు
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేని నిన్ను నేను గుర్తురానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది సీతాకోకలాగ

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా

చరణం: 2
నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది
పెదాలలో మౌనం నన్నే అపేస్తున్నది ఓ..
మనసునేమో దాచమన్నా అస్సలేమో దాచుకోదు
నిన్ను చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు
ఈ వైనం ఇంత కాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భరించేదెలాగ

నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా
ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన
ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా
నచ్చావే.. నచ్చావే.. ఓ..
నచ్చావే.. నచ్చావులే..

********  ********  *********

చిత్రం: నచ్చావులే (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దీపు , హర్షిక

పల్లవి:
ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా
Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా
ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా
Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా
రోజుకొక్క పలేసులోన ఊసులాడుకుందాం
పిచ్చి పిచ్చి మాటలెన్నో చెప్పుకుందాం
చిన్ని చిన్ని గొడవలొస్తే తిట్టి కొట్టుకుందాం
అంతలోనే జోకులేసి నవ్వుకుందాం
హో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా
Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా

చరణం: 1
నాన్న జెబులో ఓ నోటు లేపుదాం
రెండు స్ట్రాలతో ఓ డ్రింకు తాగుదాం
కదులుతుండగా బస్సెక్కి దూకుదాం
మరింత క్లోజుగా move అవుదాం
ట్రీటిచ్చుకుందాం వీకెండ్సులో
గిఫ్టులిచ్చుకుందాం మన మీటింగ్సులో
ఇలా ఎప్పుడూ మనం ఫ్రెండ్సులా
ఉండేలాగ దేవుడిని వరము అడుగుదాం

ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా
Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా

చరణం: 2
భైక్ ఎక్కుదాం బిజీగా తిరుగుదాం
రంగు రంగుల లొకాన్ని వెతుకుదాం
అప్పుడప్పుడూ అప్పిచుకుందాం
తీర్చాల్సినప్పుడు తప్పించుకుందాం
dont say sorry ఫ్రెండ్షిప్పులో
థ్యాంక్యూలు లేవే మన మద్యలో
నువ్వో అక్షరం నెనో అక్షరం
కలిపితేనే స్నేహమనే కొత్త అర్థం

హో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా
Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా
ఓహో నేస్తమా నేస్తమా ఒహొహొ నేస్తమా నేస్తమా
Oh my dear నేస్తమా నెస్తమా కొత్త కొత్త నేస్తమా

********  ********  *********

చిత్రం: నచ్చావులే (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: దీపు , హర్షిక

ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా
ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పగల్ అయిపోయా
చలి చలిగుందే మే నెల్లో
నడిచేస్తున్నా నీళ్ళల్లో
పడిపోతున్నా లోయల్లో నీవల్లే నీవల్లే
మనసా మనసా ఇది నీ మహిమా
కలిసి కలిసి నడిచే క్షణమా
ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా
ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పగల్ అయిపోయా

చరణం: 1
ఒకరికి ఒకరని ముందే రాసే ఉంటుందంటే
కాదని ఎవరనుకున్నా సాక్ష్యం మనమేలే
కన్నులు కన్నులు కలిసే గుప్పెడు గుండెను గెలిచే
మంత్రం ఎదో ఉంది అది నాకే తెలియదులే
చెవిలో చెబుతాగా నువ్వొస్తే ఇలాగ
ఎదుటే ఉన్నాగా ఊరిస్తే ఎలాగ
నిను చూస్తూ కుర్చుంటే బగుందే భలేగా
ఈ అనందంలో ఏం చెబుతా ఆరో ప్రాణమా

ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా
ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పగల్ అయిపోయా

చరణం: 2
వెన్నెల కురిసిన వేళ నిన్నే కలిసిన వేళ
ఝుమ్మని తుమ్మెద నాదం జడి వానై కురిసిందే
దగ్గరగా నువ్వుంటే కబురులు చెబుతూ ఉంటే
రెక్కలు వచ్చి మనసే రెప రెపలాడింది
చిరునవ్వుల చినుకుల్లో తడిసానే స్వయానా
నా వెచ్చని కౌగిట్లో చోటిస్తా సరేనా
ఎనలేని సంతోషం అంటారే ఇదేనా
నను ఉక్కిరి బిక్కిరి చేశావే హంపి శిల్పమా

ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పాగల్ అయిపోయా
ఓ ఓ ప్రియా ఏ క్యా హోగయా
ఓహో ఓ చెలి నే పగల్ అయిపోయా
చలి చలిగుందే మే నెల్లో
నడిచేస్తున్నా నీళ్ళల్లో
పడిపోతున్నా లోయల్లో నీవల్లే నీవల్లే
మనసా మనసా ఇది నీ మహిమా
కలిసి కలిసి నడిచే క్షణమా

********  ********  *********

చిత్రం: నచ్చావులే (2008)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జెస్సి గిఫ్ట్

పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతి
నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి
నైంటీ స్పీడులో పద్మావతి
నీ ఇంటిముందు బ్రేకువేస్తా పద్మావతి
సింగిలారన్ కొడతా సిగ్నలే ఇస్తా
కిస్సులెట్టి గాల్లోన నీకు పంపుతా
యస్ అంటే ఆ యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా
పావుతక్కువ తొమ్మిదైందే పద్మావతి
నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి

చరణం: 1
తొమ్మిది ముప్పావు చిత్రావతి
నేను చింతల్‌బస్తి వచ్చేశా చిత్రావతి
చీర దోపు కట్టుకోవే చిత్రావతి
నువ్వు చీపిరట్టి చిమ్ముకోవే చిత్రావతి
బక్క పర్సనాలిటీ ఫ్రంటు మునిసిపాలిటి
ఫిగరుమాత్రమదిరింది పిచ్చ క్వాలిటీ
యస్ అంటే ఒక్క యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా
తొమ్మిది ముప్పావు చిత్రావతి
నేను చింతల్‌బస్తి వచ్చేశా చిత్రావతి

గచ్చిబౌలి వచ్చానె గంగావతి
గంటపది కొట్టిందే గంగావతి
ఘాఘ్రా చోళీలొ గంగావతి
నువ్వు గసగసాల గంపవే గంగావతి
నువ్వు పట్టుకునే బుక్సులా పెట్టుకునే హుక్సులా
రుద్దుకునే లక్సులా ఫిక్సైపోతా
యస్ అంటే హా యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా
గచ్చిబౌలి వచ్చానె గంగావతి
గంటపది కొట్టిందే గంగావతి

నాన్న నాని నాన్న నాన్న నాని నాన్న
పావుతక్కువ పదకుండే హైమావతి
టెన్షనుగా టైముకొచ్చా హైమావతి
హై హీల్సువేసుకుంటే హైమావతి
నువ్వు నాకంటే హైటేలే హైమావతి
స్టూలు తెచ్చుకుంటా నిచ్చెనేసుకుంటా
నా తిప్పలేవో పడుతూనే అందుకుంటా
యస్ అంటే ఒక్క యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా
పావుతక్కువ పదకుండే హైమావతి
టెన్షనుగా టైముకొచ్చా హైమావతి

చరణం: 2
నాన్నానినా నాన నాన్ననినా నాన నాన్ననినా నాని నాన్నా
నాన్నానినా నాన నాన్ననినా నాన నాన్ననినా నాని నాన్నా
గంట తక్కువొంటిగంట రత్నావతి
గంట గంటకి గుర్తొస్తావే రత్నావతి
జడగంటలలా ఊగుతుంటే రత్నావతి
నాకు మెంటలెక్కి పోతోందే రత్నావతి
నీకు మల్లెమొగ్గలిస్తా పిల్లిమొగ్గలేస్తా
నాకు బుగ్గ మీద బుగ్గ పెట్టు బోలెడిస్తా
యస్ అంటే హా యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా
గంట తక్కువొంటిగంట రత్నావతి
గంట గంటకి గుర్తొస్తావే రత్నావతి

లింగులింగునొచ్చావా లీలావాతి
లంచ్ టైము అయ్యిందే లీలావాతి
నీ లిప్పుస్టిక్కు అదిరింది లీలావతి
నా లిప్పు మీద లిప్పెట్టేయ్ లీలావతి
నీకు మేనిక్యూర్ చేస్తా పీడీక్యూర్ చేస్తా
కేరళ అయుర్వేద మసాజ్ చేస్తా
యస్ అంటే హా యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా

బోరబండ వస్తానే భద్రావతి
నువ్వు బస్సెక్కె టైమైందే భద్రావతి
నీ పక్క సీటు నాకుంచే భద్రావతి
నిన్ను ఆనుకుని కూర్చుంటా భద్రావతి
నేను పళ్ళుతోముకొచ్చా పౌడర్రాసుకొచ్చా
నూనె పెట్టి నున్నంగ దువ్వుకొచ్చా
యస్ అంటే హా యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా

సంజీవయ్య పార్కులో షీలావతి
సాయంకాలం అయిదయిందే షీలావతి
సెంటు కొట్టుకొస్తానే షీలావతి
మనం సైడుకెళ్ళిపోదామే షీలావతి
నీకు పుల్ల అయిసు తెస్తా పీచుమిఠాయిస్తా
నిన్ను ఎత్తుకోని మొక్క జొన్న పొత్తులిస్తా
యస్ అంటే ఒక్క యస్ అంటే
మన్మథుడ్ని నేననీ గర్ల్ ఫ్రెండ్ ఉందని
టాం టాం అని టముకు వేసి చెప్పుకుంటా
సంజీవయ్య పార్కులో షీలావతి
సాయంకాలం అయిదయిందే షీలావతి

Tags: 2008Cherukuri Ramoji RaoMaadhavi LathaNachavuleRavi BabuShekar ChandraTanish
Previous Lyric

Badri (2000)

Next Lyric

143 (2004)

Next Lyric
143 2004 movie songs

143 (2004)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Fan Page👍

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
No Result
View All Result
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

You cannot copy content of this page