చిత్రం: నమో వేంకటేశ (2010)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాగర్, రోషిని
నటీనటులు: వెంకటేష్ , త్రిష
మాటలు (డైలాగ్స్): చింతపల్లి రమణ
కథ: గోపీ మోహన్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర
సమర్పణ: డి.సురేష్ బాబు
ఎడిటర్: యమ్. ఆర్. వర్మ
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మారెళ్ల
విడుదల తేది: 14.01.2010
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం
హో పలుకనే లేని పెదవి మౌనాన్ని
కదుపుతున్నాను నీకోసం
అదువులోలేని ఆగనేలేని
అడుగునయ్యాను ఈ నిమిషం
ఒకేలా నేడు నీలో నాలో
కలల గొడవ మొదలైయింది కొంచం
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం
నువ్వేం చేశావు నా మనసుని
నీకందించాను నీదేనని
నిన్నా మొన్నలకు వీచే కన్నులకు
నేడే అందినది ఈ గెలుపు
నీకై చూశాను అరచేతిని
నువ్వే నా గీత వయ్యావని
నాలో ఊహలకు నాలో ఆశలకు
ప్రాణం పోసినది నీ పిలుపు
ఎటో చూస్తున్న నా చూపులకు
నిదుర చెదిరి ఎదురైంది మార్పు
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం
నమ్మానే చెలీ నా ప్రేమని నీదాక వంతెనేస్తుందని
నువ్వే నేను అని ప్రేమే సైన్యమని
జయించావులే నా లోకాన్ని
ఇలా చూశాక నా బొమ్మని స్వర్గంతో నైన నాకేం పని
నన్నే కాదు అని నిన్నే చేరుకొని
పంచిస్తానులే నా అందాన్ని
ఇలా నీతోనె నన్నే చూసి మురిసిపోవ ఏడు వింతలన్ని
నీ కళ్ళలో మెరిసింది ఓ నిజం
భూమ్మేదెలా ఇక నిలవడం
మేఘాలలో ఎగిరింది ఈ క్షణం
నా మనసు గాలి పటం