• About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
Home Balakrishna

Narasimha Naidu (2001)

A A
9
narasimha naidu 2001 movie songs
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Pinterest

MoreLyrics

Maharathi – BalaKrishna (Ottu petti chepputhanu) Song Lyrics

Ooo Narappa Song Lyrics

Chalaaki Chinnammi Song Lyrics

చిత్రం: నరసింహ నాయుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: స్వర్ణలత , సుఖ్విందర్ సింగ్
నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని, ఆశా షైనీ
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: మేడికొండ వెంకట మురళి కృష్ణ
విడుదల తేది: 11.01.2001


పల్లవి:
నాధిర దిన్నా… నాధిర దిన్నా (6)

హే నాధిర దిన్నా నాధిర దిన్నా నడుమే నాజూకు
నీదనుకున్నా లేదనుకున్నా తడిగాలై తాకు
వద్దనుకున్నా ఇద్దరికున్నా వయసే ఓ షాకు
హా అద్దిర బన్నా ముద్దల కన్నా ముదిరింది జోకు
అబ్బో ఎన్ని అందాలో – ఇంకా ఏమి అందాలో
నీలో ఎన్ని పరువాలో  – ఎట్టా తెచ్చి పరవాలో
ఓ… ఓ… ఓ… ఓ… దినన దినన దిననా

హే నాధిర దిన్నా నాధిర దిన్నా నడుమే నాజూకు
హా నీదను కున్నా లేదను కున్నా తడిగాలై తాకు
అబ్బో ఎన్ని అందాలో  –  ఇంకా ఏమి అందాలో
నీలో ఎన్ని పరువాలో   –  ఎట్టా తెచ్చి పరవాలో

చరణం: 1
జిగేలు జంపల చిలగడ దుంపలు చప్పరిస్తాలే
అందం ఉలిక్కి పడుతుంటే దిండే కొరుక్కు తింటావా
తహా తహా లాడిన తలాంగు తళుకులు అప్పగిస్తావా
ప్రాయం ఉడుక్కు పోతుంటే చల్లగ ఇరుక్కు పోతావా
ఇప్పటికిప్పుడు ముద్దుల చప్పుల్లే చుమ్మా చుమ్మా
తప్పని తెలిసి ఉగ్గిన గుబ్బిల్లే
శ్రీమతి చీరకు సిగ్గుల కుచ్చిల్లే యమ్మో యమ్మా
నా మతిపోయే ప్రేమలో గిచ్చుల్లే హో

అబ్బో ఎన్ని అందాలో  –  ఇంకా ఏమి అందాలో
నీలో ఎన్ని పరువాలో   –  ఎట్టా తెచ్చి పరవాలో

చరణం: 2
లడాయి వయసులో బడాయి పోజులు తిప్పి కొడతాలే
నిన్ను మెచ్చుకుంటుంటే కాస్తా మెత్తబడతావా
కిటారు సొగసుల మిటారి సెగలకు కన్ను కొడతాలే
కస్సు బస్సుమంటూనే నాకు ప్లస్ అవుతావా
చీటికి మాటికి చీమల గుగ్గుళ్ళే జుర్రో జుర్రో
బంగిన తోట కమ్మని ఎంగిల్లే…
అత్తరు మల్లెలు చిత్తడి కౌగిల్లే కుయ్యో మొర్రో
నిద్దర పట్టని ఇద్దరి ఆకళ్ళే…

అబ్బో ఎన్ని అందాలో  –  ఇంకా ఏమి అందాలో
నీలో ఎన్ని పరువాలో   –  ఎట్టా తెచ్చి పరవాలో

ఓ నాధిరదిన్నా నాధిరదిన్నా నడుమే నాజూకు
నీదనుకున్నా లేదనుకున్నా తడిగాలై తాకు
వద్దనుకున్నా ఇద్దరికున్నా వయసే ఓ షాకు
ఆ హా హా అద్దిర బన్నా ముద్దలకన్నా ముదిరింది జోకు

అబ్బో ఎన్ని అందాలో  –  ఇంకా ఏమి అందాలో
నీలో ఎన్ని పరువాలో   –  ఎట్టా తెచ్చి పరవాలో
ఓ… ఓ… ఓ… ఓ… దినన దినన దిననా

చిత్రం: నరసింహ నాయుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: కవితా కృష్ణమూర్తి , హరిహరన్

పల్లవి:
మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది
మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ
మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది
మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ
నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే
నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని ఏమి చేసేదయ్యో
మొన్న కుట్టేసి మళ్ళి నిన్నా కుట్టేసిందంటె
పిల్లా నువ్వంటె దానికెంత ప్రేమో
నువు తిడతా తిడతా ఉన్నా అది కుడతా ఉన్నదంటే
ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో

చరణం: 1
నీ బింకం చూస్తే  – హై హై హై
ఆ పొంకం చూస్తే – హొయి హొయి హొయి
న గుండెల్లోనా – హై హై హై
బులబాటం తెచ్చెనె అమ్మాయో
ఓ ప్రియుడా నే రాను అన్నానా
చెయ్ పడితే చేజారిపోతానా
నువు కులుకుతు సై సై అంటె నే తకదిమితాళం వేస్తు
నీ చీరనై నడువొంపులో పడతాను కసి బొమ్మ

మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది
మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ
నువు తిడతా తిడతా ఉన్నా
అది కుడతా ఉన్నదంటే
ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో

చరణం: 2
పగలంతా ఒకటే – గిలిగింత
రాత్రయ్యిందంటే – తుళ్ళింతా
ఒళ్ళంతా తడిమితే – పులకింత
కుదిపేస్తా ఉంది తనువంత
నీ పరువం బరువెక్కిపోతే లలనా
ఈ చలిలో కాటైక ఉండగలనా
నా సొగసులు చిందేస్తుంటే నీ మగసిరి రంకేస్తుంటే
తెల్లారులు సైయ్యాటలే సర్కారు బుల్లోడా

మొన్నా కుట్టేసినది నిన్నా కుట్టేసినది
మళ్ళీ కుట్టేస్తున్నది గండు చీమ
మొన్న కుట్టేసి మళ్ళి నిన్నా కుట్టేసిందంటె
పిల్లా నువ్వంటె దానికెంత ప్రేమో
నే తిడత తిడతా ఉన్నా అది కుడత కుడతా ఉంటే
ఏ తీపి వస్తువు యాడ దాస్తివో ఎవ్వరికెరుకమ్మో

చిత్రం: నరసింహ నాయుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత

పల్లవి:
కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో
ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో
ముంచావే… మైకంలో…
దించావే.. నన్నీ మాయదారి హాయివేళలో

కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో
ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో

చరణం: 1
నీదేహంతో స్నేహం కావాలింకా
ఐపోతానే నే నీకోకా రైకా
కలివిడిగ నువు కలబడగ అతిగా
నిలవదిక చెలి అరమరిక రసిగా
నిగనిగ నిప్పుల సొగసులు కప్పక
మిల మిలలాడే ఈడు జాడ చూడనీ ఇక

ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో
హెయ్ కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో

చరణం: 2
సింగంలాగా ఏంటా వీరావేశం
శృంగారంలో చూపించాలా రోషం
దుడుకుతనం మా సహజగుణం చిలకా
బెదరకలా ఇది చిలిపితనం కులుకా
సరసపు విందుకు సమరము ఎందుకు
తహ తహ తాపం తళలేని తీపి హింసలో

కొ కొ కోమలి కొరుక్కుతిన్నది కోలాటంలో
కిక్కెక్కే చలి కిర్రెక్కుతున్నది ఆరాటంలో
ఒక్కొక్కోరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో
తిక్కే తీరక చిర్రెక్కుతున్నది సింగారంలో
ముంచావే… మైకంలో…
దించావే.. నన్నీ మాయదారి హాయివేళలో

చిత్రం: నరసింహ నాయుడు (2001)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , రాధిక

పల్లవి:
చిలక పచ్చకోక  పెట్టినాది కేక
చిలక పచ్చకోక  పెట్టినాది కేక
తోడులేక బలకృష్ణుడా
రెండు జడ్ల కైక రెచ్చినాది కాక
పంచుకోవే పాలమీగడ
రారా ఉల్లాస వీరుడ నీ సోకు మాడ
నీదే నా పట్టు పావడా
వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్కా
ఇస్తావా ముంత మామిడి

చిలక పచ్చకోక  పెట్టినాది కేక

చరణం: 1
చంపకమాల చంపకే బేలా
చాటుముద్దులో ఉంది ఘాటు మసాలా
కొంటె గోపాల ఆపరగోల సరసానికి ఉందిరయ్యో వేళాపాల
వద్దకొచ్చేసి హద్దు ఉందంటే
తిక్క రెచ్చిపోదా ఒసేయ్ తూగుటుయ్యాలా
వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే
మగసిరి నీకుందిగా మురళీలోల
పిల్లచూస్తే జామకాయలే
దీని తస్సదియ్య కొరకబోతే మిరపకాయలే
చెయ్యేస్తే పులకరింతలే
ఈ పిల్లగాడు నందమూరి నాటుబాంబులే

చిలక పచ్చకోక  పెట్టినాది కేక
తోడులేక బలకృష్ణుడా
రెండు జడ్ల కైక రెచ్చినాదే కాక
పంచుకోవే పాలమీగడ

చరణం: 2
నిన్ను చూశాకే వెన్ను మీటాకే
ఆడతనం లోని సుఖం తెలిసిందయ్యో
చెంగు పట్టాకే చెంపగిల్లాకే
మోజువేటలో మజా మరిగానమ్మో
పాలు కావాలా పళ్ళు కావాలా
పళ్ళు పాలతోటి పడుచు పిల్లకావాలా
చెంత చేరాకే చిందులెయ్యాలే
దాచుకున్న అందాలు  దోచిపెట్టాలే
ఏడూళ్ల అందగత్తెని నీ సోకు మాడ
ముట్టుకుంటే అత్తిపత్తిని
హా రావే నా సోంపాపిడి
నువ్వొద్దన్నా చేసేస్తా వీరముట్టడి

చిలక పచ్చకోక  పెట్టినాది కేక
చిలక పచ్చకోక  పెట్టినాది కేక
తోడులేక బలకృష్ణుడా
హో రెండు జడ్ల కైక రెచ్చినాదే కాక
పంచుకోవే పాలమీగడా
రారా ఉల్లాస వీరుడా
నా సోకు మాడ నీదే నా పట్టు పావడా
వస్తే నా పూల జంగిడి
నా తస్స చెక్కా ఇస్తావా ముంత మావిడి
రారా ఉల్లాస వీరుడా
నా సోకు మాడ నీదే నా పట్టు పావడా హొయ్

Tags: 2001B. GopalBalakrishnaM. V. Murali KrishnaMani SharmaNarasimha NaiduPreeti JhangianiSimran
Previous Lyric

Kittu Unnadu Jagratha (2017)

Next Lyric

Khaidi No. 786 (1988)

Next Lyric

Khaidi No. 786 (1988)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Fan Page👍

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
No Result
View All Result
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In