చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, సావిత్రి, కాంచనమాల
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు
నిర్మాతలు: సి.లక్ష్మీ రాజ్యం, సి.శ్రీధర్ రావు
విడుదల తేది: 11.10.1963
అమ్మా… అమ్మా…
జననీ శివకామిని
జయ సుభకారిణి విజయ రూపిణి
జననీ శివకామిని
జయ సుభకారిణి విజయ రూపిణి
జననీ శివకామిని
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మలగన్నా అమ్మవు నీవే
అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మలగన్నా అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మా
నీ చరణములే నమ్మితినమ్మా
శరణము కోరితి అమ్మా భవానీ
జననీ శివకామిని
జయ సుభకారిణి విజయ రూపిణి
జననీ శివకామిని
నీ దరినున్నా తొలగు భయాలు
నీ దయలున్నా కలుగు జయాలు
నీ దరినున్నా తొలగు భయాలు
నీ దయలున్నా కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచి
నిరతము మాకు నీడగ నిలచి
జయము నీయవే అమ్మా…
జయము నీయవే అమ్మా భవాని
జననీ శివకామిని
జయ సుభకారిణి విజయ రూపిణి
జననీ శివకామిని
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: యస్.జానకి
నరవరా…
నరవరా ఓ కురువరా
నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి లేరని
సరసులలో జాణవని
విన్నారా? కన్నారా?
విన్నారా, కన్నారా? కనులారా!!
ఓ నరవరా ఓ కురువరా
ఓ ఓ ఓ…
సురపతి నెదిరించి రణాన, పశుపతి మురిపించీ బలాన
సురపతి నెదిరించి రణాన, పశుపతి మురిపించీ బలాన
సాటిలేని వీరుండన్న, యశమును గన్న
సాటిలేని వీరుండన్న, యశమును గన్న
అర్జున ఫల్గుణ పార్ధ కీరీటి బిరుదుగొన్న విజయా!!
నరవరా ఓ కురువరా
ఓ ఓ ఓ…
నినుగని తల ఊచే ఉలూచి
కొనుమని చెయి చాచె సుభద్రా
నినుగని తల ఊచే ఉలూచి
కొనుమని చెయి చాచె సుభద్రా
నిదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
నిదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
అలరుల వెలుతుని ములుకుల గురియై వలపులమ్ముకొనురా!!
నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి లేరని
సరసులలో జాణవని
విన్నారా, కన్నారా? కనులారా!!
ఓ నరవరా ఓ కురువరా!!
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: తిక్కన సోమయాజి
గానం: గంటసాల
సీసపద్యం:
ఏనుంగు నెక్కి, పెక్కేనుంగు లిరుగడ రా
పుర వీధుల గ్రాల గలదె
మణిమయంబైన భూషణ జాలముల నొప్పి
యొడ్డోలగంబున నుండగలదె
కర్పూర చందన కస్తూరి కాదుల నింపు
సొపార భోగింపగలదె
అతి మనోహరలగు చతురాంగనల తోడి
సంగతి వేడ్కలు సలుపగలదె
తేటగీతి పద్యం:
కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర
వినుము నా బుద్ది మరలి, యీ తనువు విడిచి
సుగతి వడయుము తొల్లింట చూరగలదె
జూదమిచ్చట నాడంగరాదు నమ్ము
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: గంటసాల, యస్.జానకి
జయగణనాయక విఘ్నవినాయక
భయహర శుభకర గజముఖ గణపతి
భయహర శుభకర గజముఖ గణపతి
మూషిక వాహన త్రిభువన పూజిత
మూషిక వాహన త్రిభువన పూజిత
గణపతి వినుతీ చేసెద వినుమా
సానిపామ గమదా
స గ మ ప ని
సానిపామ గమదా
సా పప నీనిని సాసస సాసస
సా పప నీనిని సాసస సాసస
స గ రి మగరి సస
సగరి మగరి సస
ససరి సాన్ని మపనిపామ పన్ని
ససరి సాన్ని మపనిపామ పన్ని
సానిపా మ గమదా సగమ పని
సానిపామ గమదా
ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా
ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా
స్వరగతులా జతులా సరిజోడుగ
పా, సా, పా, ద, ప, మ,గ ,రి, స,ని
తా ధీం తా తకుం దరిత కిట
స్వరగతులా జతులా సరిజోడుగ
చరణ కింకిణులు ఘల్లనగా
ఆడినదీ గిరిరాజ సుతా నటరాజు మదీ రంజిలగా
నారదుడూ కలగానము సేయా
శారద హయిగ వీణను మీటా
నారదుడూ కలగానము సేయా
శారద హయిగ వీణను మీటా
భృంగీశుడూ…
భృంగీశుడూ లయరీతులు గొలుప
భృంగీశుడూ లయరీతులు గొలుప
భరతుడు తాతై యని కొనగోలు పలుకగా
ఆడినదీ గిరి రాజుసుతా
నటరాజు మదీ రంజిలగా
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: గంటసాల, పి.సుశీల
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే సొగసరీ ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును గడుసరి ఏమని వివరింతును
ఆ వలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచీ విరహాల రేపు
ఆ ఎదలో మెదలే చెలికాని రూపు
ఏవో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమ సరాగం
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందని సంబరాలే
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే సొగసరీ ఒకపరి వివరించవే
పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసి మరపించు మనసు
ప్రణయము చిందే సరసాల చందం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం, ఈ సింగారం
ఈ వయ్యారం, ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో
ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఒకపరి వివరించవే సొగసరీ ఒకపరి వివరించవే
చెలిమి కోసం చెలి మందహాసం
ఏమని వివరింతును గడుసరి ఏమని వివరింతును
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: బాలమురళి కృష్ణ , బెంగుళూరు లత
ఆ…ఆ…ఆ…
సలలితరాగ సుథారస సారం
సలలిత రాగ సుధారస సారం
సర్వ కళామయ నాట్య విలాసం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలితరాగ సుథారస సారం
మంజుల సౌరభ సుమ కుంజముల
మంజుల సౌరభ సుమ కుంజముల
రంజిలు మధుకర మృదు ఝుంకారం
రంజిలు మధుకర మృదు ఝుంకారం
సలలితరాగ సుథారస సారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలితరాగ సుథారస సారం
నిదాద స నీప నిదాపమ గమాదప సరిసా
కల్పనలో ఊహించిన హొయలు
కల్పనలో ఊహించిన హొయలు
శిల్ప మనోహర రూపమునొంది
శిల్ప మనోహర రూపమునొంది
పదకరణములా మృదు భంగిమలా
పదకరణములా మృదు భంగిమలా
ముదమారలయ మీరు నటనాల సాగే
సలలితరాగ సుథారస సారం
ఝణన ఝణన ఝణ నూపురనాదం
ఝణన ఝణన ఝణ నూపురనాదం
భువిలో దివిలో రవళింపగా
పదపమపా సనిదమద
గమదని రీసా రీసారీస్సానిపద సాన్ని సాన్ని
దమప నీదా నీదా పమదప
భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని
నాట్యము సలిపే నటరాయని
ఆనంద లీలా వినోదమే
సలలితరాగ సుథారస సారం
సర్వ కళామయ నాట్య విలాసం
సలలితరాగ సుథారస సారం
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల
సరసాలు ఉలికింప మురిపాలు పులకింప
సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ
సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ
ఓవయ్యారి మొగ్గ సయ్యాట లాడేములే
చల్లని గాలిలో జాజులు పూచెనే
చల్లని గాలిలో జాజులు పూచెనే
మనసూ పొంగిపోయి మల్లియనవ్వెనే
మనసూ పొంగిపోయి మల్లియనవ్వెనే
రావేచెలీ! నవ్వరావే చెలీ! రాకపోతే వెలీ!
వగలింక చాలించవే ఓ వయ్యారి మొగ్గ
నగుమోము చూపించవే
సరసాలు ఉలికింప మురిపాలు పులకింప
సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ
సయ్యాట లాడేములే ఓ వయ్యారి మొగ్గ
ఓవయ్యారి మొగ్గ సయ్యాట లాడేములే
ఊగే కెరటాలు ఊయల లాయెనే
ఊగే కెరటాలు ఊయల లాయెనే
తీయని ఊహలు పరుగులు తీయునే
తీయని ఊహలు పరుగులు తీయునే
ఏమే చెలీ నమ్మవేమే చెలీ – ఓహో
ఏలనే ఈ చలీ
అవిమంచి శకునాలులే ఓ వయ్యారి మొగ్గ
అనుకున్న పెళ్ళౌనులే నీవనుకున్న పెళ్ళౌనులే
అవిమంచి శకునాలులే ఓ వయ్యారి మొగ్గ
అనుకున్న పెళ్ళౌనులే నీవనుకున్న పెళ్ళౌనులే
నీవనుకున్న పెళ్ళౌనులే నీవనుకున్న పెళ్ళౌనులే
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి.సుశీల
సఖియా వివరించవే
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
నిన్ను జూచి కనులు చెదిరి
కన్నె మనసు కానుక జేసి
మరువ లేక మనసు రాక
విరహాన చెలి కాన వేగేననీ
సఖియా వివరించవే
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళ
మల్లెపూలా మనసు దోచి
పిల్లగాలి వీచేవేళ
చలువరేని వెలుగులోనా
సరసాల సరదాలు తీరేనని
సఖియా వివరించవే
వగలెరిగిన చెలునికి నా కథా
సఖియా వివరించవే
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి.సుశీల
దరికి రాబొకు రాబొకు రాజా
దరికి రాబొకు రాబొకు రాజా
ఓ తేటిరాజా వెర్రిరాజా
దరికి రాబొకు రాబొకు రాజా
మగువ మనసూ కానగలేవో
తగని మారాలు మానగ లేవో
మగువ మనసూ కానగలేవో
తగని మారాలు మానగ లేవో
నీకీనాడే మంగళమౌరా
నీకీనాడే మంగళమౌరా
ఆశా ఫలించీ తరించేవులే
దరికి రాబొకు రాబొకు రాజా
దరికి రాబొకు రాబొకు రాజా
మరుని శరాలా తెలివి మాలీ
పరువు పోనాడి చేరగరాకోయ్
మరుని శరాలా తెలివి మాలీ
పరువు పోనాడి చేరగరాకోయ్
నీవేనాడూ కననీ వినని
నీవేనాడూ కననీ వినని
శాంతి సుఖాలా తేలేవులే
దరికి రాబొకు రాబొకు రాజా
దరికి రాబొకు రాబొకు రాజా
ఓ తేటిరాజా వెర్రిరాజా
దరికి రాబొకు రాబొకు రాజా
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: బెంగుళూరు లత
ఓ… ఓ… ఓ…
ఓ శీలవతీ నీ గతి ఈ విధిగా మారెనా
అడుగడుగున గడువారానీ ఆపదలెదురాయెనా
ఓ శీలవతీ నీ గతి ఈ విధిగా మారెనా
అడుగడుగున గడువారానీ ఆపదలెదురాయెనా
అంతటి పాంచాల రాజు అబ్బరాల కూతురవై
అంతటి పాంచాల రాజు అబ్బరాల కూతురవై
భరత వంశ భూషణుడైనా పాండురాజు కోడలివై
ఓ శీలవతీ నీ గతి ఈ విధిగా మారెనా
అడుగడుగున గడువారానీ ఆపదలెదురాయెనా
జగజగాలు గెలువక జాలు పాండు సుతుల యిల్లాలు
జగజగాలు గెలువక జాలు పాండు సుతుల యిల్లాలు
కీచకులా చేతుల చిక్కి దిక్కుమాలి నశించేనా
ఓ శీలవతీ నీ గతి ఈ విధిగా మారెనా
అడుగడుగున గడువారానీ ఆపదలెదురాయెనా
ఓ శీలవతీ…
అరివీర భయంకరులౌ గంధర్వ కుమారులారా
అవలీలగ కీచకుని హతమార్చిన వీరులారా
పాండవ కులరాజ్యలక్ష్మి పాటును కనలేరా
పాలింపగ రారా రారా….
********* ********* *********
చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య
గానం: పి. సుశీల, గంటసాల, యన్. టి.ఆర్
వారి ప్రియురాలువైన నీవు
నాకు తల్లివి, పూజ్యురాలవి
నీకీ భావన ధర్మంకాదు
అర్జునా ఇది అమరలోకం
ఇక్కడ వావి వరసలు లేవు
లేకపోవచ్చు కానీ నేను మనవుణ్ణి
మా లోకంలో ఈ సాంప్రదాయాలు లేవు
లేకేం మీ ఇంటనే ఉందిగా ద్రౌపది
అన్నయిల్లాలు తమ్మునికి అమ్మగాదె !
ఎటుల పాంచాలి పొందు ఇచ్చగించి తీవు !
తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా !
తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా !
వావి వరుసలు తలపగా వలదు విజయా! విజయా
చాలు నీ పాండిత్యం
ద్రౌపదికి మాకు గల అనుబంధం
నీకు అర్ధం కాదు
ఆడితప్పని మాయమ్మ అభిమతాన !
సత్యమెరిగిన వ్యాసుని శాసనాన !
పడతికి ఈశ్వరుడొసగిన వరబలాన !
నడుచుచున్నట్టి ధర్మబంధమది వనితా !
మూర్ఖుడా మగవాడివని మనసిచ్చాను
సరసుడవని సమీపించాను
వలసి వచ్చిన వణితని ఏలుకోలేని
నీవు ఒక మగవాడివేనా
నీ మగతనం మాయమై
మాలినీ మణులు నడుమ
లజ్జా విహీనుడవై విహరించు