చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా 2001
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.ఓయ్.బాలు, సుమంగళి
నటీనటులు: జె. డి. చక్రవర్తి, మాళవిక, సంగీత, ఆశాషైని
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: శ్రీనివాసరెడ్డి
విడుదల తేది: 2001
ధిరణతోం తకిట ధిరణతోం తకిట
ధిరణతోం తకిట తానాన
నిదుర ఉండదట కుదురు ఉండదట
మధురమైన ఈ మైకాన
నిమిషమైన ఇక నిలవనీయదట
మొదట అందరికి ఇంతేనా
తగని తొందరట చిలిపి చిందులట
అదుపులేని అనందనా
వలపు తేనె రుచి తెలుసుకున్న మది
ఆగనన్నది ఏమైన
మనసుతో…మనసు ముడిపడినదీ
కనులతో… కనులు కలిసినవీ
వయసుతో… వయసు జతపడినదీ
వలపుతో …వరుస కుదిరినదీ
చెలియలో …హొయలు తికమక పడినవీ
కులుకులో… కునుకు చెదిరినదీ
నడకలో… నడుమునడిగిన బరువిదీ
బిగుతుతో ..సొగసు రగిలినదీ
చలువ నీడవని తగిన తోడువని
ఒడికి చేరిన అల్లరిని
బిడియమా… అవును సహజము కదా
కుదురుకో… ఉడుకు తెలియదు కదా
తమకమా.. తమకు తెలుసును కదా
అణుచుకొ ..తెగని తగువు కదా
చినుకులా.. ఎదను తడిమిన గొడవిది
వరదలా ..ఎదిగి తడిమినదీ
పిలుపుల.. మెలిక తిరిగిన కథకళి
తనువులో తళుకు తెలిసినదీ
అదురుతున్న తడి పెదవి అలజడికి నిదుర లేవని కలలన్ని