చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బి. చరణ్
నటీనటులు: ఉదయ్ కిరణ్, శ్రేయా శరన్
దర్శకత్వం: రాజశేఖర్ ( కన్నడ డైరెక్టర్)
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 15.08.2003
పల్లవి:
తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
చరణం: 1
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ
మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల రుణం తీర్చరా
చరణం: 2
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషా ఆచారాలను మింగెయ్యెద్దు
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా…
వెనక్కి తగ్గమాకురా
తెలుగు భాష తియ్యదనం తెలుగు భాష గొప్పతనం
తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా
అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా
******* ******* ******
చిత్రం: నీకు నేను నాకు నువ్వు (2003)
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
సాహిత్యం: పెద్దాడ మూర్తి
గానం: కె.యస్.చిత్ర, రాజేష్
నా చిరునామ ని హ్రుదయాన
కొలువైంద అవునా ఏమొ…
నా చిరునవ్వె ని పెదవుల్లొ
వెలుగైంద అవునా ఏమొ…
ని గుండెల్లొ నిండాన గొరింటల్లె పండాన
నిజమొ కాదొ నాకె తెలియదు గా….
ని కల్లలొ నెనేన ని కలలల్లె రలేన
కలవొ లేవొ వెతికె చెపుత గా
నా చిరునామ ని హ్రుదయాన
కొలువైంద అవునా ఏమొ…
మదువొలికె సిరిపెదవుల్లొ నువుదాచిన పేరు నాదేగ
ఉందనుకొ అది నిజమైతె మరి మాటగ మరదా
బుగ్గలొ కుర్ర సిగ్గులొ ఎర్రబొతె నేను కాన
అవుననొ ఇంక కాదనొ అర్దమైతె చెప్పలేన
నిమన్సంటె నేనేగ నీ మమతంత నాదేగ
ఇంకా నాకె తెలియని సంగతిగా ఆ…
నా చిరునామ మ్మ్మ్… ని హ్రుదయాన
మ్మ్మ్… కొలువైందా ఆ అవునా ఏమొ
అడుగడుగు ని ప్రతిపనిలొ ఊహించిన తోడు నేనేగ
ని ఊహె నాకొచింద గురుతెప్పుడు లేదుగా
చటుగ పూట పూటగ వెతికేదె నన్ను కాద
కాదులె లేదు లేదులె అపవాద కన్నె వీన
కాదంటుంటె అవునని లె లేదనుటుంటె వుందనిలె
ఏమొ ఏమొ ఏమొ ఏమొలే ఏ…
నా చిరునామ ని హ్రుదయాన
కొలువైందా నిజమేనేమొ
నా చిరునవ్వె మ్మ్మ్… ని పెదవుల్లొ ఆ అ
వెలుగైఅందా నిజమేనేమొ….