Love Failure Songs

Neeli Ningilo Sad Telugu Song Lyrics

నీలి నింగిలో నిండు జాబిలి… లిరిక్స్

చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: హరిహరన్
నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాణం: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబు
విడుదల తేది: 2000

నీలి నింగిలో.. నిండు జాబిలి
నేల దిగి రావే..
నన్నేల మరిచావే..
నీలి నింగిలో.. నిండు జాబిలి
నేల దిగి రావే..
నన్నేల మరిచావే..
నువ్వు లేని నేను శిలను
మెలకువే లేని కలను
నిను వీడి నే లేను
నే ఓడి మనలేను

నీలి నింగిలో.. నిండు జాబిలి
నేల దిగి రావే..
నన్నేల మరిచావే..

ప్రేమకు మరుపే తెలియదులే..
మనసు ఎన్నడు మరువదులే..
తెరలను తీసి నను చూడు
జన్మ జన్మకు నీ తోడు
వాడనిదమ్మా మన వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నేల దిగి రావే..
నన్నేల మరిచావే..

నీలి నింగిలో.. నిండు జాబిలి
నేల దిగి రావే..
నన్నేల మరిచావే..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

error: Content is protected !!