చిత్రం: నీరాజనం (1988)
సంగీతం: ఓ.పి.నయ్యర్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి. బాలు, ఎస్. జానకి
నటీ నటులు: విశ్వాస్, శరణ్య
దర్శకుడు: అశోక్ కుమార్
నిర్మాత: ఆర్.వి.రమణమూర్తి
విడుదల తేది: 1988
ఆ ఆ హా హా… ఆ ఆహా హా… ఒహో ఒహో ఒహో
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే…
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఒహో హో… ఆహా హా… ఆహా హా… ఒహో హో
ఆహా హా… ఒహో హో… ఒహో హో… ఆహా హా…
ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతి వింటిని
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే…
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఒహో హో… ఆహా హా… ఆహా హా… ఒహో హో
ఒహో హో… ఆహా హా… ఆహా హా… ఒహో హో
నీ జతగూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైనా నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే…
నిను చూడక నేనుండలేను (4)