చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం:
గానం: ఎస్.జానకి
నటీనటులు: మోహన్ బాబు, రాధిక, రజిని, జమున
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
నిర్మాత: వడ్డే రమేష్
విడుదల తేది: 24.03.1987
పైన మండి పోతుంది కింద కలిపోతుంది
పైన మండి పోతుంది కింద కలిపోతుంది
కొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాము
బావా రావా ఏకమైపోవా
పైన మండి పోతుంది కింద కలిపోతుంది
పైన మండి పోతుంది కింద కలిపోతుంది
కొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాము
బావా రావా ఏకమైపోవా
ఆగలేని జలపాతం ఆవురావురంటుంది
మీదనుంచి కిందకి ఉరకలేసి వస్తుంది
ఆగలేని జలపాతం ఆవురావురంటుంది
మీదనుంచి కిందకి ఉరకలేసి వస్తుంది
ఆ ఉరకల్లో… ఆ నురగల్లో…
ఆ ఉరకల్లో… ఆ నురగల్లో…
తడిసిపోదాం మునిగిపోదాం
బావా రావా ఏకమైపోవా
పైన మండి పోతుంది కింద కలిపోతుంది
పైన మండి పోతుంది కింద కలిపోతుంది
కొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాము
బావా రావా ఏకమైపోవా
కొరుకుతున్న చలిగాలి నన్ను కోరి వచ్చింది
వణుకుతున్న పెదవులతో కౌగిలిమ్మనడిగింది
కొరుకుతున్న చలిగాలి నన్ను కోరి వచ్చింది
వణుకుతున్న పెదవులతో కౌగిలిమ్మనడిగింది
చలి కౌగిలిలో… చలిమంటల్లో…
చలి కౌగిలిలో… చలిమంటల్లో…
ఉండిపోదాం మండిపోదాం
బావా రావా ఏకమైపోవా
పైన మంచు పడుతుంది
ముందు ముంచుకొస్తుంది
పైన మంచు పడుతుంది
ముందు ముంచుకొస్తుంది
మంచుకొండ పందిరిలోన
మూడు ముళ్ళు వేయాలి
బావా రావా ఏకమైపోవా
బావా రావా ఏకమైపోవా