Nenokkadine (2014)

Nenokkadine (2014)

చిత్రం: నేనొక్కడినే (2014)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నేహా బాసిన్
నటీనటులు: మహేష్ బాబు , క్రితి సనన్
దర్శకత్వం: సుకుమార్
నిర్మాతలు: రామ్ అచంట, గోపిచంద్ అచంట, అనీల్ సుంకర
విడుదల తేది: 10.01.2014

హల్లో రాక్‌ స్టార్ ఐయామ్ యువర్ ఏంజెల్
అరె ఓ రాక్‌ స్టార్ ఐయామ్ సింగిల్
మిస్టర్ రాక్‌ స్టార్ అవుదాం మింగిల్
చల్ చల్ రాక్‌ స్టార్  చేద్దాం జింగిల్
ఓకే అనరా ఓ కళాకారుడా వన్‌డే గర్ల్‌ ఫ్రెండై ఉండి
పండగ చేసి బ్రేకప్ అయిపోతా

ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్  నీ స్టైల్‌ కో లైక్ కొడతా

కోరస్: ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్ తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్  నీ స్టైల్‌ కో లైక్ కొడతా

చరణం: 1
ఒక్క గంట బీచ్‌ కెడదామా ఒక్క గంట ఫిష్ పడదామా
ఒక్క గంట కోక్ కొడదాం కేక పెడదాం వచ్చేయ్‌ రా
ఒక్క గంట డిస్కోకెడదామా అర్ధగంట హస్క్ కొడదామా
పావుగంట పిచ్చి పడదాం చచ్చిపుడదాం చంపెయ్‌ రా
జిందగీని విందుగ మార్చి వంద ఏళ్లని వన్‌డే చేసి
వన్‌డే గర్ల్‌ ఫ్రెండై ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా

ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్  నీ స్టైల్‌ కో లైక్ కొడతా

కోరస్: ఆవ్ తుఝే మోకోర్తా ఆవ్ తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్  నీ స్టైల్‌ కో లైక్ కొడతా

చరణం: 2
చీయర్స్ కొడుతూ బర్త్‌ డే అందాం
ఫ్రీకౌట్ చేస్తూ ఫ్రెండ్‌షిప్పే అందాం
వేలం వెర్రిగ ప్రేమించేస్తూ వేలంటెయిన్స్ డే అనుకుందాం
సిగ్గే విడిచి చిల్డ్రన్స్ డే అందాం హద్దేదాటి హాలీడే అందాం
కిస్సుల కర్మాగారంలోనే నేడే మేడే జరిపేద్దాం
అన్నీ నేడే అయిపోవాలే ఆనందంగా విడిపోవాలే
వన్‌డే గర్ల్‌ ఫ్రెండై ఉండి పండగ చేసి బ్రేకప్ అయిపోతా

ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్ తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్  నీ స్టైల్‌ కో లైక్ కొడతా

కోరస్: ఆవ్ తుఝే మోకోర్తా, ఆవ్ తుఝే మోకోర్తా
ఆవ్ తుఝే మోకోర్తా రాక్‌ స్టార్  నీ స్టైల్‌ కో లైక్ కొడతా

********   *******   *********

చిత్రం: 1 నేనొక్కడినే (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్

నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా!
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్‌ కాదు
నువ్వంటే క్యాష్ కాదు మరేంటి?
నువ్వంటే టైమ్‌ కాదు డ్రీమ్‌ కాదు గేమ్‌ కాదు
నువ్వంటే నువ్వు కాదు మరేంటి?
హూ ఆర్ యూ… ఊ… (4)
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

చరణం : 1
హేయ్ నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా
నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా
నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా
నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా
ఆటవా… పాటవా…వేటవా… వేటగాడివా…
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

చరణం : 2
నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే శ్వాసలోన తుఫానుందే
నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
నిప్పువా… నీరువా… గాలివా… ప్రశ్నవా…
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
జర దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ
హూ ఆర్ యూ! హూ ఆర్ యూ!
దిల్ సే జారా ఫూఛో సాలా హూ ఆర్ యూ

*******   ********    **********

చిత్రం: 1 నేనొక్కడినే (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సూరజ్ సంతోష్ , యమ్.యమ్.మానసి

పల్లవి:
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు పలకని మాటలాగ  నను మార్చమాకె సఖియా
హ చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు చూడని చోటులాగ నను చేయమాకె సఖియా
అలై నువ్వే నను వీడినా వెనకే సంద్రం నేనై
ఇలా రానా నీ చుట్టూ నిలవన ప్రాణాలా వలై
ఓ… సయొనరా సయొనరా సయొనరా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తెర

చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు పలకని మాటలాగ  నను మార్చమాకె సఖియా

చరణం: 1
ఊఁ నీతో ఎన్నడూ వచ్చే నీడనై నిఘా నేనేగా
నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై నిఘా నేనేగా
ఓ… పువ్వులాగ నిన్ను చూడాలంటూ ముళ్లైపోతా
ముత్యంలాగ నిన్ను దాచే ఉప్పునీరైపోతా
ఆపదొచ్చి నిను గుచ్చుకుంటే
ఆపే మొదటి గాయం నేనే ఔతా

ఓ… సయొనరా సయొనరా సయొనరా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తెర

చరణం: 2
నిశ్శబ్దంలోన నీ గుండుచప్పుడై ఉంటా తోడుంటా
శబ్దాలెన్నున్నా నీ రెప్పలచప్పుడే వింటా నే వింటా
ఓ… చేదు కలలకు మేలకువలాగ వస్తా
బాధ మేలుకుంటే నిదరై కాపుకాస్తా
వేదనలికింకా వీడుకోలు పలికే చివరి కన్నీటి చుక్కైపోతా

ఓ… సయొనరా సయొనరా సయొనరా
సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తెర

*****   ******   *******

చిత్రం: 1 నేనొక్కడినే (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్, దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, పియూష్ కపూర్

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my song, I will sing forever

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my heart, you’re my beat forever

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my song, I will sing forever

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my heart, you’re my beat forever

నావెంటే నువ్వుంటున్నా ఒంటరిగా నేనుంటున్నా దానర్థం నువ్వు నేను ఒకటి అని
ఎవ్వరితో ఏమంటున్నా నీతో మౌనంగా ఉన్నా మనకింకా మాటలతోటి లేదు పని
లోకంలో చోటెంతున్నా చాలదనీ నువు నాలో నేనే నీలో ఉంటే చాలని
నాచుట్టు వెలుగెంతున్నా వదులుకునీ నేనే నీ నీడై నీ కూడా కూడా కూడా ఉండని

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my song, I will sing forever

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my heart, you’re my beat forever

ఒకే క్షణం జన్మించడం ఒకే క్షణం మరణించడం
ప్రతీక్షణం ప్రేమించడం అదే కదా జీవించడం
ప్రేమంటేనేే బాధ బాదుంటేనే ప్రేమా ఆ బాధకు మందు మళ్ళీ ప్రేమే
ప్రేమే ఒక వల ప్రేమే సంకెలా సంకెళ్లకు స్వేచ్ఛగ ఎగరడమే

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my song, I will sing forever

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my heart, you’re my beat forever

పెదాలిల విడిపోవడం విరహం కాదు చిరునవ్వడం
పాదాలిల విడిపోవడం దూరం కాదు అడుగేయడం
నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్ధం ఆ చోటులో ప్రేమకి చోటివ్వడమే
నువ్వు నేను కలిసీ ఉన్నామంటే అర్ధం ఆ ప్రేమగా మనమే మారడమే

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my song, I will sing forever

You’re my love, you’re my love
you’re the one for me right now
You’re my heart, you’re my beat forever

*******   ********  *******

చిత్రం: 1 నేనొక్కడినే (2013)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రియా హమేష్

జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావప్పా
ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః
అల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదప్పా
ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః

జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావప్పా
ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః
అల్ఫాబెట్లు రావప్పా అక్షర జ్ఞానం లేదబ్బా
ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః

ఇంగ్లీషు బాషా… ఓ… ఓ…
ఎంతో తమాషా… ఓ… ఓ…
ప్రాక్టీసు చేశా… ఓ… ఓ…
ప్రాబ్లెమ్ పేస్ చేశా… ఓ… ఓ…

P U T పుట్ కానీ  B U T బట్
ఈ పుట్ కి బట్ కి తేడ తెలియక నా భాషే ఫట్

లండన్ బాబు లండన్ బాబూ…
ఓయ్.! లండన్ బాబు  లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లైనెట్ట కలపను నేను

హే జానీ జానీ ఎస్ పాప రైమ్స్ నాకు రావబ్బా
ఒచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మాః ఉమ్మాః
అల్ఫాబెట్లు రావబ్బా అక్షర జ్ఞానం లేదప్పా
ఏది తెలియదు ఇది తప్పా ఉమ్మాః ఉమ్మాః

Excuse me అని అడగాలనుకొని
Yes Kiss Me అని అన్నానప్పా
హాయ్యో కిస్మిస్ లా నను కొరికారబ్బా నన్ను కొరికారబ్బా
టూలెట్ అన్న బోర్డే చూసి టాయిలెట్ అనుకోని వెళ్లానబ్బా
బ్రతుకు బిస్కెట్టే అయిపోయిందబ్బా అయిపోయిందబ్బా

నా బ్యూటీ పై బ్రిటిష్ వాడు కన్నేశాడబ్బా
BMW ఇస్తానంటూ మాటిచ్చాడబ్బా
బియ్యానికి డబ్బులు అనుకొని నేనొద్దన్నానబ్బా

లండన్ బాబు లండన్ బాబూ…
ఓయ్.!  లండన్ బాబు  లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లైనెట్ట కలపను నేను

అదంతా ఓకే పాపా
ఈ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కి సొల్యూషనేంటప్పా

హా… కన్ను గీటితే కాలింగబ్బా…
పెదవి కొరికితే ఫీలింగబ్బా…
సిగ్గు సింపితే సిగ్నల్ అబ్బా నడుము తిప్పితే నోటిసబ్బా…
నా దగ్గరకొస్తే డార్లింగ్ అబ్బా … ఢీకొట్టేస్తే డీలింగ్ అబ్బా…
గోళ్ళు కొరికితే గ్రీటింగ్ అబ్బా
ఒళ్లువిరిస్తే వెయిటింగ్ అబ్బా…
బోడీ బోడి రాసేయప్పా బోర్డర్ దాటబ్బా
బోడీ బోడి రాసేయప్పా బోర్డర్ దాటబ్బా
బోడీ లాంగ్వేజ్ మన బాషబ్బా బెంగే లేదబ్బా…

ఓయ్.!  లండన్ బాబు  లండన్ బాబు
ఇండియన్ డాల్ ని నేను
లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ మేనేజ్ చేసేశాను

1 thought on “Nenokkadine (2014)”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top