చిత్రం: నేనూ మనిషినే (1971)
సంగీతం: వేదా
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు, సుశీల
నటీనటులు: కృష్ణ , కాంచన
దర్శకత్వం: జి. వి.ఆర్.శేషగిరిరావు
నిర్మాణం: మోడరన్ థియేటర్స్ 110 వ చిత్రం
విడుదల తేది: 16.10.1971
పల్లవి:
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం…
చరణం: 1
రతనాల కోట ఉంది రాచకన్నె లేదు
రంగైన తోట ఉంది రామచిలుక లేదు
ఆ రాచ కన్నెవు నీవై అలరిస్తే అందం
నా రామచిలుకవు నీవై నవ్వితే అందం
పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం…
పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం…
చరణం: 2
కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ…
తోడు లేని మరునాడూ.. వాడి పోవు కాదా
ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం…
ఆ కన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటే అందం…
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం
అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం
పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం…
చరణం: 3
నీ సోగకన్నుల పైనా బాస చేసినాను
నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను…
ఇరువురిని ఏకం చేసే ఈ రాగబంధం …
ఎన్నెన్ని జన్మలకైనా చెరిగి పోని అందం…
చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం…
అనురాగ గీతిలోనా అచ్చ తెలుగు అందం..లా.ల.లా..ల
******* ****** ******
చిత్రం: నేనూ మనిషినే (1971)
సంగీతం: వేదా
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు, సుశీల
పల్లవి:
చూసెనులే నా కనులే చూడని వింతా
చూడగనే ఝల్లుమనే నా మనసంతా
దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని
వేచి వేచి వీలులేక వేగిపోతిని
చూసెనులే నా కనులే చూడని వింతా
చూడగనే ఝల్లుమనే నా మనసంతా
దోచిన ఆ చూపులనే దాచుకుంటిని
వేచి వేచి వీలులేక వేగిపోతిని..
చరణం: 1
పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు
కానరాని ముల్లు ఎదలోన నాటినాడు
పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు
కానరాని ముల్లు ఎదలోన నాటినాడు
ముళ్ళులేని గులాబిలు ముద్దులొలుకునా
ఉరుము లేక మెరుపు లేక వాన కురియునా
చూసెనులే నా కనులే చూడని వింతా
చూడగనే ఝల్లుమనే నా మనసంతా
దోచిన ఆ చూపులనే దాచుకుంటిని
వేచి వేచి వీలులేక వేగిపోతిని..
చరణం: 2
కలల మేడలోన నను ఖైదు చేసినాడు
కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు
కలల మేడలోన నను ఖైదు చేసినాడు
కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు
కలల కన్న మధురమైన కాంక్షలుండునా
వలపులోన ఖైదుకన్న తలుపులుండునా
చూసెనులే నా కనులే చూడని వింతా
చూడగనే ఝల్లుమనే నా మనసంతా
దోచిన ఆ చూపులనే దాచుకుంటిని
వేచి వేచి వీలులేక వేగిపోతిని..
చరణం: 3
విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే
కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే
విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే
కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే
విరహ రాత్రి రేపు మాపు కరగకుండునా
వేచి యున్న వేగు పూలు విరియకుండునా
చూసెనులే నా కనులే చూడని వింతా
చూడగనే ఝల్లుమనే నా మనసంతా
దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని
వేచి వేచి వీలులేక వేగిపోతిని..
******* ****** *******
చిత్రం: నేనూ మనిషినే (1971)
సంగీతం: వేదా
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి. బాలు
పల్లవి:
ఏది ఇలలోన అసలైన న్యాయం
తేల్చగలిగేది కనరాని దైవం
ఏది ఇలలోన అసలైన న్యాయం
తేల్చగలిగేది కనరాని దైవం
మనిషి పగబూని చేసేది నేరం
ఎపుడు దిగిపోని పెనుపాప భారం
ఏది ఇలలోన అసలైన న్యాయం
తేల్చగలిగేది కనరాని దైవం
చరణం: 1
కాలమే నిన్ను కవ్వించెనేమో
కోపమే నిన్ను శాసించనేమో
కాలమే నిన్ను కవ్వించెనేమో
కోపమే నిన్ను శాసించెనేమో
శిక్ష విధియించు నీ చేతితోనే
కక్ష సాధించ విధి వ్రాసెనేమో
మనసు పొరలందు పెరిగే కళంకం
కడిగినా మాసిపోలేని పంతం
మనిషి పగబూని చేసేది నేరం
ఎపుడు దిగిపోని పెనుపాపభారం
ఏది ఇలలోన అసలైన న్యాయం
తేల్చగలిగేది కనరాని దైవం
చరణం: 2
గమ్యమే లేని పెనుకాన లోన
కళ్ళు పొరగమ్మి పొరబారినావా
గమ్యమే లేని పెనుకాన లోన
కళ్ళు పొరగమ్మి పొరబారినావా
అచట లేదోయి ఏ కాలి బాట
కానరాదోయి ఏ పూల తోట
అచట కరిచేను రాకాసి ముళ్ళు
అపుడు కురిసేను కన్నీటి జల్లు
మనిషి పగబూని చేసేది నేరం
ఎపుడు దిగిపోని పెనుపాపభారం
ఏది ఇలలోన అసలైన న్యాయం
తేల్చగలిగేది కనరాని దైవం
తేల్చగలిగేది కనరాని దైవం
తేల్చగలిగేది కనరాని దైవం