Nenu Meeku Telusa..? (2008)

చిత్రం:  నేను మీకు తెలుసా (2008)
సంగీతం: అచ్చు
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్రీరామ్ పార్థసారధి
నటీనటులు: మనోజ్ మంచు, రియసేన్
దర్శకత్వం: అజయ్ శాస్త్రి
నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల తేది: 08.10.2008

ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
ఏం మాయ వల వేస్తు వేస్తు
ఏ దారి లాగుతూ ఉందొ తననలా

అదుపులో ఉండదే చెలరేగె చిలిపితనం

అటు ఇటూ చూడదే గాలిలొ తేలి పోవడం
అనుమతి కోరదే పడి లేచె పెంకితనం
అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం
ఎం చెయ్యడం మితిమీరే ఆరాటం
తరుముతూ వుంది ఎందుకిలా హ

ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా

తప్పో ఏమో అంటుంది తప్పదు ఏమో అంటుంది
తడబాటు తేలని నడక
కోరే తీరం ముందుంది చేరాలంటె చేరాలి కద
బెదురుతు నిలబదక

సంకెళ్ళుగా సందేహం బిగిసాక
ప్రయాణం కదలదు గనక
అల లాలాగ మదినుయ్యాల ఊపే భావం
ఏమిటో పోల్చుకో త్వరగా

లోలో ఏదో నిప్పుంది దాంతో ఏదో ఇబ్బంది
పడతావటె తొలి వయసా
ఇన్నాళ్లుగ చెప్పంది నీతొ ఏదో చెప్పింది కద
అది తెలియద మనసా
చన్నీళ్లతో చల్లారను కాస్తైన సంద్రంలో రగిలెనె జ్వాల
చినుకంత ముద్దు తనకందిస్తే చాలు అంతే
అందిగా అంతేగా తెలుసా

ఏం మాయ వల వేస్తు వేస్తు
ఏ దారి లాగుతూ ఉందొ తననలా

అదుపులో ఉండదే చెలరేగె చిలిపితనం
అటు ఇటూ చూడదే గాలిలొ తేలి పోవడం
అనుమతి కోరదే పడి లేచె పెంకితనం
అడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరం

ఏమయిందొ గాని చూస్తు చూస్తు
చేజారి వెళ్ళిపోతోంది మనసెలా

error: Content is protected !!