చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1998)
సంగీతం: సిర్పీ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బాలు, మనో
నటీనటులు: జె. డి.చక్రవర్తి, రచన బెనర్జీ
దర్శకత్వం: ఈ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 1998
అరె అరే తొందరగా పాడరా బాబు
అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని
ఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు
తొందరగా పాడు కమాన్ సింగ్
ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నాయదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
బాగానే ఉందికాని ఇంతకి నువ్వు ప్రేమిస్తున్నట్టు ఆ అమ్మాయికి తెలుసా?
ఉహూఁ మరి ఆ అమ్మాయి నో అంటే ఏమి చేస్తావ్
దేవదాసునైపోతా
నీకు మందు అలవాటు లేదుకదరా చేసుకుంటా తాగుతుంటా
ఆ సీను తరువాత ముందు ఆ పిల్ల ఊరు పేరు చెప్పు
సౌందర్యం అమ్మడి ఊరు లావణ్యం ఆ చెలి పేరు
కూర్చోని ఉంటే చూసే గుండెలు ఊగాలి
తను కదిలిందంటే సాగే కాలం ఆగాలి
ఆ నవ్వుకు నేనే దాసోహం ఏ పువ్వుకు లేదే ఆ సుకుమారం
ఓ కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
ఆహా ఓహో ఏంటిరా మనోడు సూపర్ గా చెప్తున్నాడురా
నువ్వుండవోయ్ అరే తొందరగా చెప్పరాబాబు ఆఁ
ఊహల్లో ఊర్వశులైనా ఊరించే మేనకలైనా
ఆ చిన్నారిని చూశారంటే చినబోరా
తన చెలికత్తెలుగా ఉంటే చాలని అనుకోరా
ఏ కలలో లేదే ఆ అందం తను కనిపిస్తేనే కళ్ళకు అర్ధం
ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలా
తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
నాయదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరా
కోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా
లల లాల లాల లా… లల లాల లాల లా
లల లాల లాల లా… లల లాల లాల లా