చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు, సునీత
నటీనటులు: నాగార్జున, శ్రేయ శరన్, ఆర్తి అగర్వాల్
దర్శకత్వం: వి.యన్. ఆదిత్య
నిర్మాత: డి.శివ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 07.04.2004
బంతి కావాలా? బాలు కావాలా?
మెంతికూర లాంటి పిల్ల చెంతకొచ్చి చేరుకుంటే
బంతెందుకు బాలెందుకు?
ఏదేదో అడగరాదూ ఇవ్వనన్నానా
ర్యాలీ రావులపాడు రేలంగి సంతలోన
ర్యాలీ రావులపాడు రేలంగి సంతలోన
నిప్పుకోడి తెచ్చినానె నిప్పుకోడి తెచ్చినానె
పెట్టియ్యవే పిల్లా పెట్టియ్యవే
పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వాల్తేరు బుల్లోడ
అంతగాను అడుగుతుంటే పెట్టీయ్యనా
అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనా
ట్రంకు పెట్టీయనా…
ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ
కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన
కర్నూలు టౌనులోన కంసాలి కొట్టులోన
పట్టగొలుసు తెచ్చినానె పట్టగొలుసు తెచ్చినానె
కాలియ్యవే పిల్లా కాలియ్యవే
కాలియ్యవే నీ కుడి కాలియ్యవే
ఓరోరి బుల్లోడా ఒయ్యారి బుల్లోడా
వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
యింటి కెళ్ళినాక ఫోను కాలివ్వనా
యింటి కెళ్ళినాక ఫోను కాలివ్వనా
ఫోను కాలివ్వనా…
మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరుమీన
మంత్రిగారి కోటాలోన మన ఇద్దరి పేరుమీన
రైలు టిక్కెటు తెచ్చినానె రైలు టిక్కెటు తెచ్చినానె
చుట్తియ్యవే పిల్లా చుట్తియ్యవే
చుట్తియ్యవే బిస్తరు చుట్తియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వాల్తేరు బుల్లోడ
పట్టుపట్టి అడుగుతుంటే చుట్టివ్వనా
అంటు పెట్టు కుంటే గంట చుట్టివ్వనా
గంట చుట్టివ్వనా…
ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ
అడిగింది అందుకోక అందేది అడగలేక
అడిగింది అందుకోక అందేది అడగలేక
నీరుగారి పోయినావు నీరుగారి పోయినావు
చారెయ్యనా పిలగా చారెయ్యనా
చారెయ్యనా ఉలవచారెయ్యనా
ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మా
నంగనాచి బుల్లెమ్మా నాంచారి బుల్లెమ్మా
చిలిపి చిందులాటలోన చారెయ్యవే
ఏక్, దో, తీన్, చారెయ్యవే చారు పాంచెయ్యవే
షామిరు పేటలోన షావుకారు షాపులోన
షామిరు పేటలోన షావుకారు షాపులోన
నోటు బుక్కు తెచ్చినానె నోటు బుక్కు తెచ్చినానె
రాసియ్యవే పిల్లా రాసియ్యవే
రాసియ్యవే అందం రాసియ్యవే
ఓరోరి బుల్లోడ వయ్యారి బుల్లోడ
వగలమారి బుల్లోడ వైజాగు బుల్లోడ
పొత్తుకోరి చేరుకుంటే రాసియ్యనా
నెత్తిమీద మంచినూనె రాసియ్యనా
నునె రాసియ్యనా
ఉస్కులకడి గుమ్మ గుమా ఐసలకడి టంకు టమ
మాటల పోటీలోన మీది మీది ఆటలోన
మాటల పోటీలోన మీది మీది ఆటలోన
పిల్లతోటి ఓడినావు పిల్లతోటి ఓడినావు
తీసెయ్యరో పిలగా తీసెయ్యరో
తీసెయ్యరో మీసం తీసెయ్యరో హెయ్
ఓసోసి బుల్లెమ్మ వయ్యారి బుల్లెమ్మ
రవ్వలాంటి బుల్లెమ్మ రాంగురూటు బుల్లెమ్మ
మీసకట్టు ముద్దులాటకడ్డం అంటూ
చెప్పలేక చెప్పినావే తీసెయ్ మంటూ
మీసం తీసెయ్ మంటూ…
********** ********** *********
చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఆర్నాడ్ చక్రవర్తి, శ్రేయ గోషల్
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా
ముద్దుకున్న టేస్టు మారిపోవునా
కోరస్: సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
ఆరుబైట కూడినా పడకటింటకూడినా
ఆరు ఒకటి ఏడుకాక పోవునా
కోరస్: సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
ప్యారు చేసినా లవ్వు చేసినా
ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా
ముద్దుకున్న టేస్టు మారిపోవునా
ఎడమకన్ను కొట్టినా – సూరిరామ్ సూరిరామ్
కుడి కన్ను కొట్టినా – సూరిరామ్ సూరిరామ్
కళ్ళ లోని కోరికే మారునా
విస్తరేసి పెట్టినా పళ్లెమేసి పెట్టినా
వంటలోని ఘాటు మారిపోవునా
ఊరే మారినా ఊపు మారునా
వస్ర్తం మారినా వరుసమారునా
సెల్లుమారు ఇల్లుమారు పిల్లదాని ఒళ్లుమారు
గజ్జేల్లో ఘల్లు మారునా – నా…
జంటప్రేమల్లో జిల్లు మారునా – నా… నా…
గజ్జెల్లో ఘల్లుమారునా…
జంటప్రేమల్లో జిల్లు మారునా…
పపపా పపపా పపపా పపపా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా
ముద్దుకున్న టేస్టు మారిపోవునా
కోరస్: సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్ సూరిరామ్
తేనెతోటి తుడిచినా నేతితోటి తుడిచినా
కోకపిల్ల ఆకలే తీరునా
కీచులాటలాడినా కిస్సులాటలాడినా
రాతిరేళ యాతనే తీరునా
అందం యిచ్చినా ఆశ తీరునా
భాగం పంచినా బాధ తీరునా
లుక్కుతీరు కిక్కుతీరు పెక్కుసార్లు తిక్కతీరు
ఆటల్లో అలుపుతీరునా గోటిగాయాల్లో సలుపుతీరునా
ఆటల్లో అలుపుతీరునా గోటిగాయాల్లో సలుపుతీరునా
నూజివీడు కెళ్లినా న్యూజిలాండు కెళ్లినా
ముద్దుకున్న టేస్టు మారిపోవునా
ఆరుబైట కూడినా పడకటింటకూడినా
ఆరు ఒకటి ఏడుకాక పోవునా
ప్యారు చేసినా లవ్వు చేసినా
ప్యారుకాక లవ్వుకాక కాదలే చేసినా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
ప్రేమల్లో పిచ్చ మారునా కుర్రవయస్సుల్లో కచ్చతీరునా
********** ********** *********
చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు , శ్రేయ గోషల్
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంతదాక వచ్చాక అడ్డెందుకూ
లోతులోన మునిగాక వడ్దెందుకు
కరుసు పెట్టనపుడు సొమ్మెందుకూ
సరస మాడనప్పుడు సొగసెందుకూ
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
అడుగుడు అడుగుడుగుడు లంచం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
చెడుగుడు చెడుగుడుగుడు చమ్ చమ్
చరణం: 1
కంటిలోన నలుసు తీయమన్నావు
నలుసుతీసి చెంప నలపమన్నావు
చెంప గిల్లి ఆగలేను అన్నావు
పెదవి పండు ముద్దు పిండుకున్నావు
పెదవి నుండి మెడలోకి చేరుకున్నాకా
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా
గుండెలో జారుకుని గుట్టనే గుంజుకుని
అంతలో పుంజుకుని అదును చూసి అదుపుదాటితే
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
జరుగుడు జరుగుడు గుడు కొంచం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
విరుగుడు విరుగుడు గుడు కొంచం
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ హేయ్
చరణం: 2
కాలిలోని ముల్లు తియ్యమన్నావు
ముల్లుతీసి మువ్వ ముట్టమన్నావు
మువ్వముట్టి ముందుకెళ్ళి పోయావు
చీర అంచు పట్టి పైకి పాకావు
చీరలోని మూరలోన చిక్కుకున్నాక
దారి తెన్ను ఏదినాకు చిక్క కున్నాక
చెంగులే దులుపుకుని నిన్ను చేపట్టుకుని
చీరలా చుట్టుకుని చివరి వరకు కథలు నడిపితే…
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
తరికిట తరికిట కిట తధ్యమ్
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంతదాక వచ్చాక అడ్డెందుకూ
లోతులోన మునిగాక ఒడ్దెందుకు
కరుసు పెట్టనపుడు సొమ్మెందుకూ
సరస మాడనప్పుడు సొగసెందుకూ
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
అడుగుడు అడుగుడుగుడు లంచం
గుడుగుడు గుడుగుడుగుడు గుంచం
చెడుగుడు చెడుగుడుగుడు చమ్ చమ్
చమ్ చమ్
********** ********** *********
చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు, చిత్ర
అరెరెరెరె… అరెరెరెరె…
అరెరెరెరె… ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరె… అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఏటేటో అవుతాది చిన్నబ్బీ
అట్తాగే ఉంటాది ఓరబ్బీ
ఏటేటో అవుతాది చిన్నబ్బీ
ఎండల్లో చలెక్కుతోంది గుండెల్లో కలుక్కుమంది
నువ్వట్టా నరాలు మెలేసి నడుస్తు వస్తుంటే
సిగ్గంతా చెడేట్టువుంది చిక్కుల్లో పడేట్టువుంది
చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే
కొంపలు ముంచకు దుంప తెగ
కోకకు పెంచకు కొత్తసెగ
గమ్మత్తుగ మత్తెక్కించే వేళ
నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ
పైటెక్కడుంటుందే చిన్నమ్మీ
నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ
పైటెక్కడుంటుందే చిన్నమ్మీ
అరెరెరెరె అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఏటేటో అవుతాది చిన్నబ్బీ
కళ్లల్లో అదేమి కైపో నడకల్లో అదేమి ఊపో
నిలువెల్లా తెగించి తెగించి ఎగబడి పోతుంటే
ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లో అదేమి మెరుపో
వాటంగా వయస్సు వలేసి తికమక పెడుతుంటే
తూలకు తూలకు తిమ్మిరిగా
తుళ్లకు తుళ్లకు తుంటరిగా
ఒళ్లంతా గల్లంతై పోయేలా
జడవూపి నడువూపి నిగనిగల నిధులు చూపి
నువ్వు వీరంగంమేస్తుంటేే ఓలమ్మీ
ఊరంత ఊగిందే చిన్నమ్మీ
వీరంగంమేస్తుంటే ఓలమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ
అరెరెరెరె… ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుంది చిన్నమ్మీ
అరెరెరెరె రరె రరె… అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఏటేటో అవుతాది చిన్నబ్బీ ఎహేయ్…
********** ********** *********
చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర
వేణుమాధవా… వేణుమాధవా…
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోదిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై
నినుచేరనీ మాధవా…
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్నుచేరిందీ అష్టాక్షరిగ మారిందీ
ఎలా ఇంత పెన్నిధీ వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ…
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోదిపై వాలితే మౌనమే మంత్ర మౌతున్నదో
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకీ
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులసడి వినబడక హృదయానికీ
అలజడితో అణువణువూ తడబడదా
ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…
నువ్వే నడుపు పాదమివి నువ్వేమీటు నాదమివి
నివాళిగా నామది నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధీ…
గాగ్గరి గరి సరి గాగ్గ రీరి సరి గపద సాస్స దప గరి సరీ
గ గ ద ప దా … గ ప ద స దా… ధా పా గా రీ గా
దప దసస్స దప దసస్స దప దరిర్రి దప దరిర్రి
దసరి గరి సరీ గరి సరీ దా రి గారి సరిగా…
రిస దప గగగపాప్ప గగగదాస్స గగగ సాస్స
దప గప గస రిస రిస రిగ రిస దసరీ గదప సగరీ
పగప దసరీ సరిగ పగరీ సద పదప సదస పదప సదస పదప రిసరి పదప రిసరి
పద సరి గరి సద పదస గదప రిదస సరిగ పద సరిగా…
రాధికా హృదయ రాగాంజలీ
నీ పాదముల వ్రాలు కుసుమాంజలీ
ఈ గీతాంజలీ…
********** ********** *********
చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి, సునీత
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ… నీకేంకాదని
నిన్నటిరాతనీ… మార్చేస్తాననీ…
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ…
నేనున్నాననీ… నీకేంకాదని
నిన్నటిరాతనీ… మార్చేస్తాననీ…
ఎవ్వరు లేని ఒంతరి జీవికి తోడు దొరికిందనీ
అందరూవున్నా అప్తుడు నువ్వై చేరువయ్యావనీ
జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావనీ
శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ… నీకేంకాదని
నిన్నటిరాతనీ… మార్చేస్తాననీ…
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ… నీకేంకాదని
నిన్నటిరాతనీ… మార్చేస్తాననీ…
********** ********** *********
చిత్రం: నేనున్నాను (2004)
సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె.కె., శ్రేయ గోషల్
వేసంకాలం వెన్నెల్లాగ వానల్లొ వాగుల్లాగ
వయసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ
సొగసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసి సందడివేళ ఆకూ వక్కా సున్నం
నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం
గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్నపాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాటలేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా మూగపాటగా ఆగిపోకె రాగమాలికా
నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం
నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం
సిగ్గుపోరితో నెగ్గలేవుగా ఏడు మల్లెలెత్తు సుకుమారమా
సాయమీయకా మోయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దరకానా చిగురంటి పెదవులపైనా
మురిపాల మువ్వను కానా దొరగారి నవ్వులలోన
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి
నువ్వొద్దరలేని పద్దతిలోన ముద్దుల్నెన్నో తెచ్చా
నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం
వేసంకాలం వెన్నెల్లాగ వానల్లొ వాగుల్లాగ
వయసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ
సొగసు ఎవరికోసం
తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా
నీకోసం – నీకోసం
నీకోసం – నీకోసం
నీకోసం – నీకోసం
నీకోసం – నీకోసం
నీకోసం – నీకోసం
నీకోసం