చిత్రం: నిండు సంసారం (1968)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆరుద్ర, సినారె
గానం: గంటసాల
నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: సి.ఎస్.రావు
నిర్మాతలు: పి.గంగాధర రావు
విడుదల తేది: 05.12.1968
ఎవరికీ తలవంచకు
ఎవరినీ యాచించకు
గుండె బలమే నీ ఆయుధం
నిండు మనసే నీ ధనం
ఎవరికీ తలవంచకు
ఎవరినీ యాచించకు
కండలు పిండే కష్టజీవులకు
తిండికి కరువుంటుందా
నిజాయితీకై నిలిచేవాడికి
పరాజయం ఉంటుందా
మంచితనమ్మును మించిన పెన్నిధి
మంచితనమ్మును మించిన పెన్నిధి
మనిషికి వేరే ఉందా మనిషికి వేరే ఉందా
ఎవరికీ తలవంచకు
ఎవరినీ యాచించకు
చాలీ చాలని జీతంతో
మిడి మేలపు కొలువులు కొలవకు
ముడుచుకు పోయిన ఆశలతో
హొయ్ మిడి మిడి బ్రతుకును గడపకు
ముడుచుకు పోయిన ఆశలతో
హొయ్ మిడి మిడి బ్రతుకును గడపకు
చీకటి రాజ్యం ఎంతోకాలం
చాలయించదని మరవకు
చాలయించదని మరవకు
ఎవరికీ తలవంచకు
ఎవరినీ యాచించకు
జీవితమే ఒక వైకుంఠ పాలి
నిజం తెలుసుకో భాయి
ఎగరేసే నిచ్చనలే కాదు
పడదోచే పాములు ఉంటాయి
చిరునవ్వులతో విషవలయాలను
ఛేదించి ముందుకు పదవోయి
ఛేదించి ముందుకు పదవోయి
ఎవరికీ తలవంచకు
ఎవరినీ యాచించకు