చిత్రం: నిన్నే పెళ్ళాడతా (1968)
సంగీతం: విజయ కృష్ణమూర్తి
సాహిత్యం: సినారె
గానం: సుశీల
నటీనటులు: యన్ .టి.రామారావు, భారతి
దర్శకత్వం: బి.వి.శ్రీనివాస్
దర్శకత్వ పర్యవేక్షణ: జి.విశ్వనాధం
నిర్మాత: బి. విఠలాచార్య
విడుదల తేది: 30.08.1968
పల్లవి:
మల్లెల పానుపు ఉంది…చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా…
నీ కోసమా నా కోసమా…కాదోయి కాదు మన కోసమే
చరణం: 1
నీ జోడుగా నేనుంటానని…నీ జోడుగా నేనుంటానని
నీ నీడలో మేడ కడతానని..అన్నాను కాదా ఆనాడే
అది తీరలేదా ఈనాడే…ఏ..ఏ..
మల్లెల పానుపు ఉంది…చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా…
నీ కోసమా నా కోసమా…కాదోయి కాదు మన కోసమే
చరణం: 2
అందాల గంధాలు అందించనా…అందాల గంధాలు అందించనా
పరువాల పన్నీరు చిందించనా…
కనరానిదోయి ఈ హాయి…మనసైన దోయి ఈ రేయి
మల్లెల పానుపు ఉంది…చల్లని జాబిలి ఉంది
నీ కోసమా నా కోసమా…
నీ కోసమా నా కోసమా…కాదోయి కాదు మన కోసమే…