చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామ
నటినటులు: నాగార్జున, టబు
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: నాగార్జున
విడుదల తేది: 04.10.1996
పల్లవి:
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
మా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారా
సెలక్షన్ చూశాం ..శభాషంటున్నాం
అహా…
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
సరేరా కుమారా అలాగే కానీరా !
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం
చరణం: 1
ప్రేమదాకా ఓ..కే… పెళ్లి మాత్రం షాకే..
చాలురా నారదా నీ హరికథ…పెళ్లయే యోగమే నీకున్నదా ?
ఇంటిలో ఇందరం ఉన్నాం కదా..కోరితే సాయమే చేస్తాం కదా
పార్కులో సీను .. తప్పురా శ్రీను
అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి ముద్దాడుకుంటార్రా కుర్రాళ్ళు !
ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే మేము మాత్రం కాదంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే… మ్మ్…మ్మ్..
చరణం: 2
సిగ్గుపడవే పండు .. నువ్వు కాదురా ఫ్రెండు..
ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం..అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం
విందులు మెక్కుతూ వంకలు పెడతాం…చీటికి మాటికి చెలరేగుతాం
అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
పెళ్లి కాగానే అందర్నీ తరిమేసి మిమ్మల్ని గదిలోకి నెట్టేసి..
ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ మేలుకుంటాం మీకు పోటీగా
లలల్లా లలల్లా లలల్లా లలల్లా
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా
సెలక్షన్ చూశాం..వాహ్.. శభాషంటున్నాం..
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరా
బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై..హై..హై…
నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామా…
***** ***** *****
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సౌమ్య
పల్లవి:
గ్రీకువీరుడూ..గ్రీకువీరుడూ
గ్రీకువీరుడూ నా రాకుమారుడూ కలల్లోనె ఇంకా ఉన్నాడూ
film స్టారులూ క్రికెట్టు వీరులూ కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ
DREAM BOY…..
రూపులో చంద్రుడూ చూపులో సూర్యుడు
DREAM BOY…..
ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ..ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ…
ఎంత గొప్పవాడే నావాడూ..రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడూ..
ఎంతో…ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ…వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు…గ్రీకువీరుడు…
గ్రీకువీరుడు…గ్రీకువీరుడు…
చరణం: 1
నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా..
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా…
style లో వాడంత వాడు లేడూ..
నన్ను కోరినా మగాళ్ళు ఎవ్వరూ
నాకు నచ్చలేదే what to…do…
నేను కోరినా ఏకైక పురుషుడూ..ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో…ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ..
ఎందుకో…ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు…గ్రీకువీరుడు…
గ్రీకువీరుడు…గ్రీకువీరుడు…
చరణం: 2
లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడూ
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవలేడూ
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడూ
కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ..ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా ఎందుకంత దూరం ఉంటాడూ
ఎంతో…ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ…వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకువీరుడు…గ్రీకువీరుడు…
గ్రీకువీరుడు…గ్రీకువీరుడు…
***** ***** *****
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సంజీవ్, సుజాత
పల్లవి:
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
చరణం: 1
మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా
నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం
చరణం: 2
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం
***** ***** *****
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్
పల్లవి:
ఎటో వెళ్లిపోయింది మనసు…
ఎటో వెళ్లిపోయింది మనసు…
ఇలా ఒంటరైయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో
ఎటో వెళ్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు
ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో.
చరణం: 1
ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ
ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ..
చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో..
చరణం: 2
కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ
ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ..
తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..
***** ***** *****
చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం: సందీప్ చౌతా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, సౌమ్య
పల్లవి:
హబ్బబ్బ దూకుతోంది లేత ఈడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
ఇంకా ఏదో కావాలంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ..యే
చరణం: 1
ఆ..ఆ
వొంపు వొంపులోన ఉరికింది తాపం
చంపుతోంది నన్ను నాజూకు రూపం
ఏం చేసినా చాలు అనలేని ఈ వేళలో
ఇంకా ఏదో ఐపోమంటూ…
ఉప్పొంగి దూకుతోంది లేత యీడు నీ చూపు లాగి
ఒళ్ళంతా పాకుతుంది వింత కైపు నీ ఊహ తాగి
చరణం: 2
ఆ..ఆ..
గోటిగాటు తీపి గాయాలు రేపి
పంటిగాటు తోటి ప్రాయాన్ని లేపి
నరనరములా నిప్పు రాజేసిన మత్తులో
ఇంకా యేదో చేసేయ్‌మంటూ
వేడెక్కి వేగుతోంది కోడే యీడు నీ శ్వాస తాగి
కవ్వింత రేగుతోంది కోరుకున్న నీ స్పర్శ సోకీ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో కావాలంటూ
ఇంకా ఏదో….