Ninne Premistha Lyrics

Ninne Premistha (2000)

Advertisements

Ninne Premistha Lyrics

ప్రేమలేఖ రాసెను నా మనసే… లిరిక్స్

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ సామవేదం
గానం: హరిహరన్
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాణం: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000

పల్లవి:

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని

చరణం 1:

కనులకు తెలియని ఇదివరకెరుగని చలినే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదికెను ఆమెను చేరాలని
ఎదసడి నాతోనే చెప్పకపోదా ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపక పోవా చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం.. ప్రేమకు స్వాగతం

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని

చరణం 2:

కవితలు చాలని సరిగమ లెరుగని ప్రేమే నా పాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగిచూడనా ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం.. ప్రేమకు స్వాగతం..

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

కోయిల పాట బాగుందా… లిరిక్స్

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు , కె. ఎస్. చిత్ర
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాణం: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000

పల్లవి:

కోయిల పాట బాగుందా.. కొమ్మలసడి బాగుందా..
పున్నమితోట బాగుందా.. వెన్నెల సిరి బాగుందా..

కోయిల పాట బాగుందా.. కొమ్మల సడి బాగుందా..
పున్నమితోట బాగుందా.. వెన్నెల సిరి బాగుందా..
అందమైన మల్లె బాల బాగుందాఅల్లి బిల్లి మేఘమాల బాగుందా..
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

కోయిల పాట బాగుందా.. కొమ్మలసడి బాగుందా..
పున్నమితోట బాగుందా.. వెన్నెల సిరి బాగుందా..

చరణం 1:

అప్పుడిప్పుడు గున్నమామి తోటలో అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా
నిదురించిన ఎద నదిలో అల లెగిసిన అలజడిగా
తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

కోయిల పాట బాగుందా.. కొమ్మలసడి బాగుందా..
పున్నమితోట బాగుందా.. వెన్నెల సిరి బాగుందా..

చరణం 2:

మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గచుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా
కలలుకనే కన్నులలో కునుకెరుగని కలవరమా
రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

చరణం 3:

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది
అందమైన మల్లె బాల బాగుంది అల్లి బిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ప్రేమా ఎందుకనీ నేనంటే… లిరిక్స్

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఈ. ఎస్. మూర్తి
గానం: రాజేష్ కృష్ణన్ , కె. ఎస్. చిత్ర
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాణం: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000

పల్లవి:

ప్రేమా ఎందుకనీ నేనంటే.. అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తోంది
ప్రేమా ఎందుకనీ నేనంటే.. అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు

చరణం 1:

పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకూ
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటి చెరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే నా చెలి మందారం
ఎంత చేరువై వుంటే అంత సంబరం

ప్రేమా ఎందుకనీ నేనంటే.. అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ…

చరణం 2:

ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం
వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవం

ప్రేమా ఎందుకనీ నేనంటే.. అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు
ఇన్నాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తోంది

ప్రేమా ఎందుకనీ నేనంటే.. అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావూ…

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

గుడిగంటలు మ్రోగినవేళ… లిరిక్స్

Advertisements

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఘంటాడి కృష్ణ
గానం: రాజేష్ కృష్ణన్ , కె. ఎస్. చిత్ర
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాణం: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000

పల్లవి:

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగుల వేళా తెగ తొందర పెడుతోంది
ఆ దేవుని పూజకు నువ్వొస్తే..
ఆ దేవిని చూడగ నేనొస్తే..
అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట

చరణం 1:

నా చిరునవ్వై నువ్వే ఉండాలి ..ఉండాలి
నా కనుపాపకు రెప్పై వుండాలి ఉండాలి ..ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి.. పోవాలి
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ..ఎదగాలి.. ఎదగాలి
నా చెలి అందెల సవ్వడి నేనై నా చెలి చూపుల వెన్నెల నేనై

చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి
నుదుటి బొట్టై నాలో నువ్వు ఏకమవ్వాలి

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళా తెగ తొందర పెడుతోంది

చరణం 2:

వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి ..పోయాలి
నెచ్చెలి పమిటికి చెంగును కావాలి ..కావాలి.. కావాలి
కమ్మని కలలకు రంగులు పూయాలి.. పూయాలి
నా చిరునామా నువ్వే కావాలి ..కావాలి ..కావాలి
తుమ్మెద నంటని తేనెవు నువ్వై కమ్మని కోకిల పాటవు నువ్వై

చీకటిలో చిరుదివ్వెవు నువ్వై వెలుగులు పంచాలి
వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
సడి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

ఆ దేవుని పూజకు నువ్వొస్తే..
ఆ దేవిని చూడగ నేనొస్తే..
అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోందీ..
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోందె..

ఒక దేవత వెలసింది నా కోసమే… లిరిక్స్

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: డా. వెనిగళ్ల రాంబాబు
గానం: ఎస్.పి.బాలు , కె. ఎస్. చిత్ర
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాణం: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000

పల్లవి:

ఒక దేవత వెలసింది నా కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..

చరణం 1:

విరిసే వెన్నెల్లోనా, మెరిసే కన్నుల్లోనా నీ నీడే చూశానమ్మా
ఎనిమిది దిక్కుల్లోన ముంగిలి చుక్కల్లోనా నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..

చరణం 2:

రోజా మొక్కను నాటి ప్రాణం నీరుగా పోసి పూయించా నీ జడ కోసం
రోజూ ఉపవాసంగా, హృదయం నైవేద్యంగా పూజించా నీ జత కోసం
నీరెండకు నీవెంటే నీడై వచ్చి మమతలతో నీగుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నాళ్ళూ అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

ఒక దేవత వెలసింది నీ కోసమే… లిరిక్స్

చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: డా. వెనిగళ్ల రాంబాబు
గానం: కె. ఎస్. చిత్ర
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాణం: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000

పల్లవి:

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..
ఒక దేవత వెలసింది నా కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా.. సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా.. శ్రీరస్తంటూ నీతో అంది ఇలా … నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమే…. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..

చరణం 1:

విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోనా నీ నీడే చూసాడమ్మ
ఎనిమిది దిక్కుల్లోనా నింగిలి చుక్కల్లోనా నీ జాడే వెదికాడమ్మ
నీ నవ్వే తన మదిలో అమృతవర్షం… నీలోనే వుందమ్మ అందని స్వర్గం
రవళించే హృదయంతో రాగం తీసి నీ కుంకుమ తిలకంతో కవితే రాసి
అంటుందమ్మా తన మనసే… నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..

చరణం 2:

కళ్ళకు కలలే రెండు కాటుక సుగ్గులు చిందు కాబోయే కళ్యాణంలో
తనలో సగమే నీది నీలో సర్వం తనది అనురాగం మీ ఇద్దరిది
ఆ తారా తోరణమే మల్లెల హారం చేరాలి మురిపాల సాగర తీరం
అలరించే మీ జంట వలపుల పంటా శుభమంటూ దీవించే గుడిలోగంట
చెప్పాలి తనతో నీవే… నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..
సంధ్యా కాంతుల్లోన శ్రావణిలా.. సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా.. శ్రీరస్తంటూ నీతో అంది ఇలా… నిన్నే ప్రేమిస్తానని…

ఒక దేవత వెలసింది నీ కోసమే.. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే..

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Kudirithe Kappu Coffee (2011)
error: Content is protected !!