Ninnu Choodalani (2001)

చిత్రం: నిన్ను చూడాలని (2001)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రాజేష్ కృష్ణన్ , చిత్ర
నటీనటులు: జూ.యన్. టి. ఆర్, రవీన రాజ్పుత్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: రామోజీరావు
విడుదల: 25.05.2001

ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ
ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ
ఇంతవరకు ఏ రవివర్మ చూపలేదే ఈ చిరునామా
నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోద మోనాలిసా

ఆ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మా

మెరిసే సింగారం మేలిమి బంగారం
ఏ మానస సరోవరంలో స్నానం చేస్తుందో
ఓ…ఓ…ఓ…ఓ…
నీ తియ్యనిస్నేహం తాకినదా దేహం
నీ తుంటరి తలపుల తడితో తళ తళ లాడినదో
ఓ…ఓ…ఓ…ఓ…
నిన్నుచూసి కంటిరెప్ప వెయ్యలేనుగా
తల్లడిల్లిపోయే గుండె ఊపిరాడక
కవితలా నన్నల్లే శ్వాస కాళిదాసౌతుంటే చూశా

ఆ ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మా
నీలో నా ప్రాణం కొలువుందో ఏమో
నీ వైపే పరుగెడుతోంది నిలవని నా పాదం
ఓ…ఓ…ఓ…ఓ…
నాలోని రూపం వెలిగిందో ఏమో
నావైపే రానంటోంది నడిరాతిరి పాపం
ఓ…ఓ…ఓ…ఓ…
కళ్ళముందు ముచ్చటైన జంట ఉండగా
కాలమంత ఆగిపోదా కాలు సాగక
నడిసివచ్చే మెరుపుని చూశా
నిన్ను తాకి నిలువున మెరిశా

ఊపిరొచ్చిన బాపు బొమ్మ నేలకొచ్చిన నెలవంకమ్మ
ఇంతవరకు ఏ రవివర్మ చూపలేదే ఈ చిరునామా
నవ్వుతుంటే ఈ మణిపూస చిన్నబోద మోనాలిసా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Sri Krishnarjuna Yuddhamu (1963)
error: Content is protected !!