Ninu Choodaka Nenundalenu (2002)

చిత్రం: నినుచూడక  నేనుండలేను (2002)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: సాధనాసర్గమ్
నటీనటులు: సచిన్ జోషి , భావనా పణి
దర్శకత్వం: ఆర్.శ్రీనివాస్
నిర్మాత: జె. యమ్.జోషి
విడుదల తేది: 21.12.2002

పల్లవి:
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేదే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేదే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా

చరణం: 1
ఓ..రోజు చూస్తూ ఉన్నా స్నేహంగానే ఉన్నా
చెప్పలేనే ఎందుకోమరీ
నాలో తానే ఉన్నా అంతా చూస్తూ ఉన్నా
అందుకోడే ఇంత ప్రేమనీ
ఏ నీలిమేఘానితో… రాయాలి నా ప్రేమనీ
ఏ పూల రాగాలతో… పంపాలి ఆ లేఖనీ
మనసేమో క్షణమైనా ఒక చోట ఉండదే

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా

చరణం: 2
అమ్మో బాబో అన్నా నువ్వే దారి అన్న
చిన్న మాట గొంతు దాటదే
మాటే రాదంటున్నా దారే లేదంటున్నా
గుండె చాటు ప్రేమ ఆగదే
ఈ మోహలుయ్యాలలో… నా ఆశ తీరేదెలా
ఈ గాలి కౌగిళ్ళలో… నా మాట చేరేదెలా
ఎవరైనా తెలపాలి మదిలోన బాధని

జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా
ఎవరనీ అడగకే ఉన్నమాట చెప్పలేదే ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా ఊసులాడే గోరువంకా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Kanne Vayasu (1973)
error: Content is protected !!