చిత్రం: నోము (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సినారె
గానం: ఎస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: రామకృష్ణ , చంద్రకళ, శరత్ బాబు, జయసుధ
దర్శకత్వం: పట్టు
నిర్మాణం: ఎవిఎం ప్రొడక్షన్స్
విడుదల తేది: 15.08. 1974
మనసే జతగా పాడిందిలే
తనువే లతగా ఆడిందిలే
మనసే జతగా పాడిందిలే
తనువే లతగా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..
హ.. హహ..
మనసే జతగా పాడిందిలే
తనువే లతగా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..
హో
ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది
ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది
హో.. అందుకే ఓ చెలి
అందుకో కౌగిలి.. ఓ చెలీ
హే..హే..
మనసే జతగా పాడిందిలే
తనువే లతగా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..
హో మనసే జతగా పాడిందిలే
తనువే లతగా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..
నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది
నీ కొంగును మించిన అందాలు
తనలో లేవన్నది
నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది
నీ కొంగును మించిన అందాలు
తనలో లేవన్నది
హో…. అందుకే ఓప్రియా
అందుకో పయ్యెద ఓప్రియా
హేహే…మనసే జతగా పాడిందిలే
తనువే లతగా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..
హో మనసే జతగా పాడిందిలే
తనువే లతగా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..
ఈ వేళలో ఎందుకో..