చిత్రం: NTR (కథానాయకుడు) (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ, ఎమ్. ఎమ్. కీరవాణి
గానం: శరత్ సంతోష్ , మోహన భోగరాజు, ఎమ్. ఎమ్. కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమల
నటీనటులు: బాలకృష్ణ , మోహన్ బాబు, రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్, విద్యాబాలన్, రకూల్ ప్రీత్ సింగ్, ఆమని
దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్
నిర్మాత: నందమూరి బాలక్రిష్ణ , సాయి కొర్రపాటి
విడుదల తేది: 09.01.2019
నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…
న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..
తల్లి ఏది? తండ్రి ఏడి?
అడ్డు తగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసుపొరల మసకలేవీ?
నీ ఇల్లు నీ వాళ్ళు
నీదంటూ ఈ చింత
సుంతైన లేని ఈ నేల పై నడయాడు ఋషివో
కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు
మనిషివో.. ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో.. నీవెవరివో.. ఎవరివో
న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..
జాగృతములో జాగు ఏదీ? రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా.. అలుపు ఏదీ? దిగులు ఏదీ?
ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగిీ..
కదనరంగాన కర్మయోగీ
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం
న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..
నిర్వసన, వాసాన్న సంక్షేమ
స్వాప్నికుడు ఇతడు..
నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ
శ్రామికుడు ఇతడు..
నిరత సంఘశ్రేయ సంధాన
భావుకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..
నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…
న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..
న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం
న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
.చిదానందరూప:
శివోహం శివోహం..
***** ***** *****
చిత్రం: NTR (కథానాయకుడు) (2018)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ
గానం: కైలాష్ కెహర్
ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా…
ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా…
త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా
ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా…
త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా..
ఆహార్యాంగిక
వాచిక పూర్వక
అద్భుత అతులిత
నటనా ఘటికా..
భీమసేన వీరార్జున
కృష్ణ దానకర్ణ
మానధన సుయోధాన
భీష్మ బృహన్నల
విశ్వామిత్ర
లంకేశ్వర దశకంఠరావణాసురాధి
పురాణ పురుష భూమికా పోషకా…
సాక్షాత్ సాక్షాత్కారకా..
త్వదీయ ఛాయాచిత్రాచ్ఛాదిత
రాజిత రంజిత్ చిత్రయవనికా..
న ఇదం పూర్వక
రసోత్పాదకా..
కీర్తికన్యాకా..
మనోనాయకా..
కథానాయకా..
కథానాయకా..
ఘన కీర్తిసాంధ్ర
విజితాఖిలాంధ్ర
జనతాసుధీంద్రా
మణి దీపకా…
త్రిశతకాధిక
చిత్రమాలిక
జైత్రయాత్రక
కథానాయకా
indulo song ledu ..only lirics undi
Just comment once you Will get which you need or wait until to update for helping purpose only not for copy, download????