Number One (1994)

number one 1994

చిత్రం: నెంబర్ వన్ (1994)
సంగీతం: ఎస్. వి. కృష్ణా రెడ్డి
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
నటీనటులు: కృష్ణ , సౌందర్య
దర్శకత్వం: ఎస్. వి. కృష్ణా రెడ్డి
నిర్మాత: అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
విడుదల తేది: 14.01.1994

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేర్చుకో గుండెలోనా

తాకితే ఎర్రాని బుగ్గ కందాలా
మీటితే వయ్యారి వీణ థిల్లానా
కలికిచిలక వలపు చిలకగా
కలువచెలియ కలువ రమ్మనె
కిలకిలలో మురిపెములే అలలు అలలుగా
జల్లులై వెల్లువై పొంగిపోయే

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా

ఓ ప్రియా లాలించమంది వయ్యారం
మోజులే చెల్లించమంది మోమాటం

చిలిపిచూపు సొగసు నిమరగ
జాజితీగ జడకు అమరగ
గుసగుసలే ఏఏ ఘుమఘుమలై గుబులు రేపగా
ఝుమ్మనే తుమ్మెదై కమ్ముకోవా

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా

వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా

Leave a comment

You cannot copy content of this page