• About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
A To Z Telugu Lyrics
No Result
View All Result
Home Movie Albums

Nuvvostanante Nenoddantana (2005)

A A
0
Share on FacebookShare on TwitterShare on WhatsappShare on Pinterest

MoreLyrics

Dhada Dhada Song Lyrics In Telugu & English – The Warriorr

Life Ante Itta Vundaala Song

Woo Aa Aha Aha Song Lyrics

nvnv

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, సుమంగళి
నటీనటులు: సిద్దార్ధ, త్రిష , శ్రీహరి, సంతోషి
దర్శకత్వం: ప్రభుదేవా
నిర్మాత: యమ్.ఎస్.రాజు
విడుదల: 14.01.2005

ఊ నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

హే నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

హా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు
నామాట విన్నట్టు నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు
నీకోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

ఇదివరకు ఎదలయకు ఏమాత్రము లేదు హోరెత్తు
ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు
నీలేత పాదాలు జలపాత మయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం

హే నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నాపేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

*********   *********   **********

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు

ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల
అందించే ఆహ్వానం ప్రేమంటే
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా
పిలిపించే తడిగానం ప్రేమంటే
అణువణువును మీటె మమతల మౌనం
పదపదమంటే నిలువదు ప్రాణం
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
దాహంలో మునిగిన చివురుకు
చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

చరణం: 1
ప్రాణం ఎపుడు మొదలైందో
తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
ప్రణయం ఎవరి హృదయంలో
ఎపుడు ఉదయిస్తుందో
గమనించే సమయం ఉంటుందా
ప్రేమంటే ఏమంటే చెప్పేసె మాటుంటే
ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
అది చరితను సైతం చదవనివైనం
కవితలు సైతం పలకని భావం
సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటె
దరిదాటి ఉరకలు వేసె ఏ నదికైనా తెలిసిందా
తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినదేదంటే
చిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

చరణం: 2
మండే కొలిమినడగందే
తెలియదే మన్నుకాదు
ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే
పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై
దరిజేరె ప్రియురాలే గెలుపంటె
తను కొలువై ఉండే విలువే ఉంటే
అలాంటి మనసుకు తనంత తానే
అడగక దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో
అడుగులు కలిపే జతవుంటే
నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే
ఆ కాంతె నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

ఘల్ ఘల్ ఘల్ ఘల్
ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్ (2)

*********   *********   **********

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: జస్సి గిఫ్ట్, కల్పన

శివశివ మూర్తివి గణనాథా
శివశివ మూర్తివి గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
శివుని కొమరుడవు గణనాథా
ఛల్ సిరికి హరికీ మనువంట
ఛల్ సిరికి హరికీ మనువంట
భళరే అనరా జనమంతా
భళరే అనరా జనమంతా
హేయ్ ఘల్లుమంటు గజ్జ కట్టి
చిందు కొట్టే జగమంతా

అదిరే అదిరే కన్నే అదిరే
అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటిసారిగా ఎదురయిందిగా
వయసు వేడుకా ఓ… ఓ…

అదిరే అదిరే కన్నే అదిరే
కుదిరే కుదిరే అన్నీ కుదిరే

చరణం: 1
ఏం మాయ మెలికో కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో అదేం పంటి కొరుకో
వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
హెయ్ వరసై పిలిచే అందాలు
అరె మనమై చిలికే గంధాలు
అహ మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా

అదిరే అదిరే కన్నే అదిరే
ఓ కుదిరే కుదిరే అన్నీ కుదిరే

చరణం: 2
పన్నీటి చినుకో పసిడిపంట జిలుగో
కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
పందార తునకో పదం లేని తెలుగో
మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేనాలు
హో హో చెవిలో పడనీ మేళాలు
అరె అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
మదన దీపిక మదిని మీటగ ఎదురు లేదుగా

అదిరే అదిరే కన్నే అదిరే
హే కుదిరే కుదిరే అన్నీ కుదిరే హేయ్…

*********   *********   **********

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా
తందానే  తందానే
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా
నిన్ను మెచ్చి నీలో చేరిందా
తందానే  తందానే
నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంట
ఏవంట
నువ్వెళ్ళే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా… ఓ…

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా

ఏలే ఏలే ఏలో ఏలేలేలో ఏలో
ఏలేలేలో ఏలో ఏలో ఏలే ఏలేలో

హాయ్ మై నేమ్ ఈజ్ సంతోష్
యువర్ నేమ్ ప్లీజ్  – స్టెల్లా
స్టెల్లా ఓ వాటే బ్యూటిఫుల్ నేమ్
కెన్ యూ హేవ్ ఏ ఫోన్ నంబర్
రేయ్ రేయ్ రేయ్…
ఓ… కమింగ్ డాడ్

గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ…

హే గగగా రిగ రిసాస సానినిస
గగగా రిగ రిససా…

కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాపలాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా
జావళీల జాణతనం బాటచూపగా
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
అంతటా ఎన్నో వర్ణాలు
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
ఇంతలా ఏవో రాగాలు

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
సాగుతున్న ఈ పయనం ఎంత వరకో
రేపు వైపు ముందడుగా లేని పోని దుందుడుకా
రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే
లెక్కలే మాయం అయిపోవా
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే
దిక్కులే తత్తర పడిపోవా

*********   *********   **********

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, సాగర్

పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
హే పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా
అంత మారాం ఏంటంట మాట వినకుండా
సరదాగా అడిగాగా మజిలీ చేర్చవా
తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట

చరణం: 1
నా సంతోషాన్నంతా పంపించా తన వెంట
భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందరవందర సరదా
ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా

హోయ్ చినబోయిందేమో చెలి కొమ్మ
ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా
నీ వాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి
నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా
తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట

హే పుటుక్కు జర జర డుబుక్కు మేఁ
పుటుక్కు జర జర డుబుక్కు మేఁ

చరణం: 2
ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది

హోయ్ ఏం గారం చేస్తావే ప్రేమ
నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా
ఆ సంగతి నీకూ తెలుసమ్మా
నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు
నిలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంట
ఓ ప్రేమా తీసుకుపో నీ వెంట
తీసుకుపో నీ వెంట అరి తీసుకుపో నీ వెంట
అరి హొయ్ హొయ్ హొయ్

*********   *********   **********

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు

something something something
something something there is some thing…
Come on…
అందర్లోనూ ఉంది something
అర్ధం కానీ ఏదో feeling
లో లో దాగున్నా no no nothing అంటున్నా
పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా…
అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా…

ఓ కొంటె కలా ఆ పంతమేలా
రా ముందుకిలా కం నియర్ ఇలా
చెయ్యందిస్తా చంద్రకళా
సందేహిస్తా వెందుకలా
సంకెళ్ళేమీ లేవు కదా why fear అలా
చిలిపి చిటికి తలుపు తడితే నిదరపోతే ఇంకా
మసక తెరల ముసుగు చాటుగా
ఎలాంటి అలుపు లేక ఆటాడమంది వేళ
మాయదారి హాయి గోల

అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా…

అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా…

అందర్లోనూ ఉంది something
అర్ధం కానీ ఏదో feeling

నీ కాలి వెంట ఈ నేల అంతా
ఏం తుళ్ళెనంట క్యా కమాల్ అనేలా
ఆకాశంలో పాలపుంత నీ కన్నుల్లో వాలుతుందా
సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేలా
తకిట తదిమి జతులు ఉరిమి తరుముతున్న వేళ
ఉలికిపడదు తళుకు తారకా
మహానంద లీల సాగుతోంది వేళ
కాలమంత ఆగిపోదా…

అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా…

అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా…

అ అ ఆజా అ అ ఆజా
తుజే హజార్ బార్ పిలిచినా కదా
సునో సరోజా ఆజారే ఆజా
జవాబు జాడ లేదు క్యా కరే ఖుదా…

*********   *********   **********

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సాగర్

పాదం కదలనంటుందా
ఎదురుగా ఏ మలుపుందో కాలం ముందే చూడందే
దూరం కరగనంటుందా
తారలను దోశిల పట్టే ఆశలు దూసుకు పోతుంటే
లోతెంతో అడగననే పడవల్లే అడుగేస్తే
దారియను అంటుందా కడలైనా
తన కలలుగ మెరిసే తళుకుల తీరం
నిజమై నిలిచే నిమిషం కోసం
పిసలను తరిమే ఉరుమే ప్రేమంటే

నువ్వే తన ఐదో తనమని నీకై నోచే నోముంటే
నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా
తానే నీ పెదవులపై చిరు నవ్వై నిలిచే ప్రేమంటే
ఆ తీపికి విషమైన అమృతమే ఐపోదా

Tags: 2005Devi Sri PrasadGeethaM.S. RajuNuvvostanante NenoddantanaSanthoshiSiddharth NarayanSrihariTrishaVeda Archana Shastry
Previous Lyric

Brindavanam (2010)

Next Lyric

Jodi (1999)

Next Lyric

Jodi (1999)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Fan Page👍

A To Z Telugu Lyrics is a website which provides all telugu songs lyrics as like as movie songs, private album songs, devotional, folk songs lyrics etc,.

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • Contact Us
No Result
View All Result
  • Movie Albums
  • Devotional
  • Trending Lyrics
  • Motivational Mode
  • Bhakti
  • Love Failure Songs
  • Love Songs
  • Private Album Songs
  • Telugu Rain Songs
  • Laali Paatalu
  • Folk Lyrics

Copyright © A To Z Telugu Lyrics 2019-2022. All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

You cannot copy content of this page