Nuvvu Naaku Nachav (2001)

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్ , ఆర్తి అగర్వాల్, ఆశా షైనీ, పృథ్విరాజ్
కథ, మాటలు ( డైలాగ్స్ ): త్రివిక్రమ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె. విజయభాస్కర్
సినిమాటోగ్రఫీ: కె.రవీంద్ర బాబు
ఎడిటర్: ఎ.శ్రీకర్ ప్రసాద్
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల: 06.09.2001

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కుమార్ సాను, చిత్ర

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ… చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి
ఓ… నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి

చరణం: 1
చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చెబుతామా
లేని పోని కలలెందుకని మేలుకుంటే అవిరావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా
కలలన్నవి గలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి
మననడిగి చేరుతుందా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ… చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని

చరణం: 2
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కదా
అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని
ఓ… చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

***********    **********  *********

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలు

ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం…
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
ఓ ప్రియతమా ఇది నిజమా
ఈ పరిచయం ఒక వరమా
ఇది మనసు పడిన విరహ వేదనా…
తొలి ప్రేమలోని మధుర భావనా…

చరణం: 1
ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా
ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా
నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో
వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో
ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై
విచ్చాయో చెప్పేదెలా
ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ
ఆ గుట్టు విప్పేదెలా

ఓ ప్రితమా దయగనుమా…
నీ చూపే చాలు చంద్రకిరణమా
నా జన్మ ధన్యమవును ప్రాణమా…

చరణం: 2
చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో
చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో
నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు
నీ అందమేమందునే
పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ
ఒళ్ళంతా వయ్యారమే
నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి…
నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి

ఓ ప్రియతమ ఔననుమా
కనలేవ ప్రియుని హృదయవేదనా
కరుణించు నాకు వలపు దీవెనా…
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా
ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా
ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం …
శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా

********   **********  **********

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా యిళ్ళ  లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల
కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు
తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ
ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా

ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా యిళ్ళ  లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

*********    *********   **********

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు, హరిణి

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో – భయం దేనికో

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా

వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా
నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా
నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనుకా
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా

అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా
అయోమయంగ వేయ్యకలా హాయి వలా
నీమీదికొచ్చి ఉరితాడై వాలదుగా వాలుజడా
దానొంక చూసి ఎందుకట గుండెదడ
మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా
తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చేయనే నీతో ఎలా వేగనే

నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా
మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా
పంతం మానుకో  –  భయం దేనికో

ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు
ఇంకెలాగ సత్యభామా
నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు
ఏమి చెయ్యనయ్యో రామా

**********   **********   **********

చిత్రం: నువ్వు నాకు నచ్చావ్ (2001)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు
తాను పలికితె చాలు తేనె జలపాతాలు
ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది

గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల
కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో
గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా
మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో
అలా నడిచి వస్తూంటే పువ్వుల వనం
శిలైపోని మనిషుంటే మనిషే అనం

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది

గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం
ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను
గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసితనం
రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను
కలో కాదో నాకే నిజం తేలక
ఎలా చెప్పడం తాను నాకెవ్వరో
అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ
ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు
వేస్తూ అల్లుకుంటుంది
ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు
మదిలో గుచ్చుకుంటుంది
ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది
చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది
పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా
తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Chuttalabbai (1990)
error: Content is protected !!