చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: నాగార్జున, సిమ్రాన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 05.04.2000
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తనరూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలోకిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గుటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
దీనిలో సాంగ్స్ రావడం లేదు నీ ప్రాబ్లం
Hi,
It works well. This issue with your device or network.We are in the process of update. In this update covers maximum devices.pls, reopen once with good network connection at speed 150kbps or above.
Thank you.