O Papa Lali Lyrics

O Papa Lali ( 1990 )

O Papa Lali Lyrics

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే… లిరిక్స్

చిత్రం: ఓ పాపాలాలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: ఎస్.పి.బాలు
నటీనటులు: ఎస్.పి.బాలు, రాధిక
దర్శకత్వం: వసంత్
నిర్మాణం: ఏక్ నాథ్
విడుదల తేది: 27.07.1990

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా!!

చరణం: 1
వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను
చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను
చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!

కన్నె పిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు

చరణం: 2
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు

సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా!!

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

నీవేగా నా ప్రాణం అంటా… లిరిక్స్

చిత్రం: ఓ పాపాలాలి (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: కె.జె.యేసుదాస్, కె. ఎస్. చిత్ర
నటీనటులు: ఎస్.పి.బాలు, రాధిక
దర్శకత్వం: వసంత్
నిర్మాణం: ఏక్ నాథ్
విడుదల తేది: 27.07.1990

నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీ నీడగా నే సాగేనులే నీ వెంటా

నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే
ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే
పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే
పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే
కలిసేనులే నే కరిగేనులే నీలోన

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

కంటి వెలుగై నిలిచిపోనా మనసులోన నిండిపోనా
కలలలోని కథను నేనై చివరి వరకు తోడు రానా
స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే అంతేగా
నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే
నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడు

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీ నీడగా నే సాగేనులే నీ వెంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Oopiri (2016)
error: Content is protected !!