చిత్రం: ఓ సీత కథ (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కాంతారావు, చంద్రమోహన్ , రోజారమని
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాతలు: శర్మ, సి. అశ్వనీదత్
విడుదల తేది: 1974
చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల
చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల
గట్టుమీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి
చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల
గట్టుమీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి
చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల
చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి చేయి చాచి
చెలిమి చేయ పిలిచింది చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల
చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల
చింత చిగురు పులుపని చీకటంటె నలుపని
చెప్పందే తెలియని చిన్న పిల్ల
అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చి పిల్ల
ఎర వేసిన పిల్లవాడు ఎవరనుకుందో
ఎగిరి వచ్చి పడ్డదీ ఆతని ఒడిలో
తుళ్ళి తుళ్ళి ఆడే… చిలిపి చేప పిల్ల
తాళి లేని తల్లాయే అమ్మ చెల్లా
నాన్న లేని పాపతో నవ్వే లోకంలో
ఎన్నాల్లు వేగేను చేప తల్లి
అభం శుభం తెలియని పిచ్చి తల్లి పిచ్చి తల్లి…