Oka Raju Oka Rani (2003)

చిత్రం: ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం: చక్రి
నటీనటులు: రవితేజా , నమిత
దర్శకత్వం: యోగి
నిర్మాత: రామోజీరావు
విడుదల తేది: 19.06.2003

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా
స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వానలా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా

రేయి చీర కప్పుకున్న చందమామని
నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళని
తారలన్ని అల్లుకున్న మేఘమాలని
వాలు కళ్ళ సాగరాన కాటుకల్లె మారని
వాలే పొద్దులా జారే నీ జడ
నడుము పై నాట్యమే ఆడితే
విరిసే పువ్వులా కురిసే మంచులా
నువ్వలా చల్లగా నవ్వితే
నేను చూడలేను చూశాక ఆగలేను
ఎన్నాళ్ళు నిన్ను ఒదిలి ఉండను

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా

మూసి ఉన్న రెప్పలల్లో కలల వనములా
నిదుర రాని వేళలోన కలవరింతలా ఇలా
ఊపిరంత ఊహలతో నిండిపోయినా
గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా
నేనే నేనుగా లేనే లేనుగా
నాకే వింతగా ఉందిగా
నీలా ఎవ్వరు నన్నే ఎప్పుడు
కమ్ముకోలేదులే ఇంతగా
రేయి నిదుర రాదు
పగలంత కునుకు లేదు
ఆసలేమయిందో నాకే తెలియదు

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా
ఎండలో ఇలా పూల వానలా
మెరుపు కూడ మల్లె తీగలా
నేలపై ఇలా నా అడుగు నిలవదా
లోకమంత కొత్త చోటులా
నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా

స్వరాల వీణ ఈ వేళలోన
నీకేమైయిందే ఆకాశమా

*******  ********  ********

చిత్రం: ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం: చక్రి

నా ప్రాణం నా ప్రణయం నా లోకం అన్ని నువ్వె
నా మౌనం నా గానం నా గుణ్డెల సవ్వడి నువ్వె
నువ్వే ఆశా నువ్వే స్వాస
నువ్వు లేని ఈ నిమిషం యుగమైన అవదుగ

నాలో ఉన్న నిన్ను మరిచె పొలేని నేను
తీరం లేని అలలా నిజమే కాలేని కలలా
నాలొ లేని నేను కలవాలంటునె నిన్ను
నీరే లేని నదిలా కన్నీరై ఉన్న మదిలా
వర్షం కొరి యండే చూసి మండే భూమిలా
ప్రేమే కోరి విరహం చూసి మిగిలా నేనిలా
వేరే దారి చూపె వేళ నిన్నే చేరుకొనా

నీ కౌగిళ్ళలోనే కాలం మాయమవని
నీ వేడి ఉపిరిలొ ఇక నన్నేఎ కరిగిపోని
నా ప్రతి అడుగులొను వెంటాడే ఙ్నాపకాలు
నువ్వే లేని నాడు చనిపొయే వరమే చాలు
వేళ్ళే దారి ముళ్ళే చల్లి నన్నే ఆపితె
నీళ్ళే మారి నిప్పై పొంగి నన్నే ముంచితే
గాలే జాలి చూపే వేళ పువ్వై చేరుకొనా

*******  ********  ********

చిత్రం: ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం: చక్రి
సాహిత్యం: త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం: కౌసల్య

లలలల లలాలలల లలలల లలాలలల
లాలలల లలలాల లాలలల
చికిట చికిట తం చికి చికి చికితం
చికిట చికిట తం చికినక చికితం
చికిట చికిట తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగీ నేల
ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చె వానేదైనా
కనిపెడదాం కాసేపైన హో హో
Nine o’ clock కూసే కోడి
Round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామ హూ

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల

ప్రియురాలై ఈ నేల ఆకశం చూసే వేళ
కదిలొచ్చే ప్రతి చినుకు ఓ ముత్యం అయిపోలేదా
ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లొ
ఈ గాలి జొ లాలి పాడాలి ఇలలో
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెఏదాం ఇప్పటికైనా హూ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెద్దాం ఎప్పటికైనా హొ హొ
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చెద్దాం ఎప్పటికైనా హొ హొ

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల

చెయ్యేత్తి పిలిచానా చుక్కల్లొ చంద్రుడు కూడా
పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపోడా
కొమ్మలనే కుర్చీలా వాడె కొయిల
వాసంతం విరిసింది కూ అనవే ఎలా
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హూ

కలలు కంటాను నేనీ వేళ
పగలు రాత్రితో ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగీ నేల
ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చె వానేదైనా
కనిపెడదాం కాసేపైన హో హో
Nine o’ clock కూసే కోడి
Round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామ హూ