Motivational Songs Lyrics

Okate Jananam Okate Maranam Song Lyrics | ఒకటే జననం ఒకటే మరణం లిరిక్స్

ఒకటే జననం ఒకటే మరణం… లిరిక్స్

చిత్రం: భద్రాచలం (2001)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: శంకర్ మహదేవన్, చిత్ర
నటీనటులు: శ్రీహరి, సింధు మీనన్
దర్శకత్వం: యన్. శంకర్
నిర్మాణం: మేడికొండ వెంకట మురళీకృష్ణ
విడుదల తేది: 06.12.2001

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు

కష్టాలురానీ కన్నీళ్లురానీ… ఏమైనాగానీ ఎదురేదిరానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు… నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు…

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు

రాబోయే విజయాన్ని… పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ చప్పట్లే… గుండెలలో మోగాలి

నీ నుదిటీ రేఖలపై… సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే… చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే… నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం…

నీలి కళ్ళల్లో మెరుపే మెరవాలి… కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి… తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు

నిదరోకా నిలుచుంటా… వెన్నెలలో చెట్టువలె
నీ కోసం వేచుంటా… కన్నీటి బొట్టువలె
అడుగడుగూ నీ గుండె… గడియారం నేనవుతా…
నువు నడిచే దారులలో… ఎదురొచ్చి శుభమవుతా…

రాశిగ పోసిన కలలన్నీ… దోసిలి నిండా నింపిస్తా
చేతులు సాచిన స్నేహంలా…

ముట్టుకున్నావా… మువ్వా అవుతుంది
పట్టుకున్నావా… పాటే అవుతుంది
అల్లుకున్నావా… జల్లే అవుతుంది
హత్తుకున్నావా… వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం…
ఒకటే గమనం ఒకటే గమ్యం…
గెలుపు పొందె వరకూ… అలుపు లేదు మనకు
బ్రతుకు అంటె గెలుపూ… గెలుపు కొరకె బ్రతుకు

***** ***** 🙏 సమాప్తం 🙏 ***** *****

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

See More Lyrics
Dongalludu (1993)
error: Content is protected !!