చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.కీరవాణి , గంగ
నటీనటులు: నందమూరి తారకరత్న , రేఖ వేదవ్యాస్
దర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డి
నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 18.09.2002
నువ్వు చూడు చూడకపో
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా
నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
మనసు పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో
వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో
ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
పూజించటం పూజారి వంతు వరమివ్వడమన్నది దేవత ఇస్టం
ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించడమన్నది ప్రేయసి ఇస్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదు గా నిన్ను మరవడం జరగదు గా
ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా
నిను చూడలని ఉన్నా
నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా
మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోనా నాలోనా కన్నీరవుతున్నా
********* ******** *******
చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బి.చరణ్ , చిత్ర
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా… హే
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా…
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా
అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైలు నీదిరా
అందుకే… ఐ లవ్ యూ రా
ఆడపిల్ల ఒరేయ్ అందంటే ప్రేమలోని పడ్డట్టేరా
నీ రొట్టె విరిగి ఎంచక్కా నేతిలోన పడిపోయేరా
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా
చరణం: 1
ఏంట్రా గూట్లే… ఆహాహా ఎంత ప్రేమగా పిలిచిందో చూడరా
ఏంట్రా గూట్లే టెలిఫోన్ పోలల్లే ఎదిగావురా
పోరా డోంగ్రి ఐస్ఫ్రూట్ పుల్లల్లే అదిరావురా
ఎంట్రా టుమ్రీ తొక్కలోది నీ డ్రస్సే బాగుందిరా
పోరా పుస్కీ దిక్కుమాలిన నీ ఫేసే సూపర్బ్ రా
ఏరా లఫంగి నువ్వేరా
ఏరా పుడింగి నీ పేరా
బే అన్న బేవర్సన్నా
బచ్చా అన్నా బడవా అన్నా
ప్రతిమాట పరమార్థం ప్రేమేరా
ఆహా మీ తిట్లే వింటుంటే ప్రేమ ముదిరినట్టుందిరా
ఓహో మీరు మాకు హ్యాపీగా బీరు పార్టీ ఇచ్చుకొండిరా…
ఒరేయ్… ఒరేయ్… ఒరేయ్ చిలక రూటుకొచ్చిందిరా
ఒరేయ్ ఇక వెళ్లండిరా
ఒరేయ్ చిలిపి చిలిపి పనులున్నాయ్ రా
ఒరేయ్ కళ్లు మూయండిరా
చరణం: 2
ఏంట్రా మెంటల్… ఓహొహో ఏం ముద్దుగా పిలిచావ్ పిల్లోయ్
ఏంట్రా మెంటల్ చల్లనైన నీ మనసే ఎయిర్ కూలర్ రా
పోరా కిండల్ దూకుతున్న నీ వయసే టూవీలర్ రా
రారా ఉల్ఫా కాల్చుతున్న చూపే సిగరెట్లైటర్ రా
పోరా పిస్తా చిక్కుకున్న నడుమే సెంటీమీటర్ రా
నా దేశముదురు నువ్వేరా
నా చేదు షుగరు ఇలా రా
ఇడియట్ అన్నా స్టుపిడ్ అన్నా
ట్యూబ్లైట్ అన్నా ఎల్బోర్డ్ అన్న
ప్రతి తిట్టు ప్రేమలోన దీవెనేరా
డౌట్ లేదు వీళ్లు మనకు లేనట్టేరా
ఒరేయ్ నువ్వునాకు నచ్చావురా
ఒరేయ్ ఐ లవ్ యూ రా
ఒరేయ్ నేను నిన్ను మెచ్చానురా
ఒరేయ్ అదంతేరా
అరరె చురుకు నీకు ఉందిరా
అసలు కొత్త స్టైలు నీదిరా
అందుకే… ఐ లవ్ యూ రా
********* ******** *******
చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, చిత్ర
ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని అందంగా పెరగాలని
చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ
ఎన్ని జన్మలెత్తిన మగవాడై పుట్టాలని మీసాలే పెంచాలని
పొట్టి లాగు వయసు దాటి ప్యాంటు నేను తొడగాలని
పెళ్లంటూ చేసుకుంటే నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ పుచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ఆశ చచ్చే ఆశ
నిన్నంటు చూశాక మాటాడే ఆశ మాటల్నే కలిపాక మనసిచ్చే ఆశ
ఇద్దరికీ ప్రేమన్నది కలగాలని ఆశ పెద్దలకి మనసంగతి తెలియాలని ఆశ
పెద్దలకి తెలిశాక పెళ్లంటూ కుదిరాక
తాళంటు బిగిశాక గోలంతా ముగిశాక
ఫలహారం తిన్నాక పడకింటికి చేరాక
తలుపుల్ని మూశాక తలగడని సర్దాక
బెడ్ లైటే ఆర్పాక వడ్డాణం విప్పాక
దగ్గరగా జరిగాక బిగ్గరగా…
చెప్పూ… ఆశ ఆశ ఆశ దోశ దోచే ఆశ
గోడలకి మన గొడవలు తెలియొద్దని ఆశ
మంచం మన ముచ్చట్లను చూడొద్దని ఆశ
పడకింట్లో పెనవేతలు ఆపాలని ఆశ
డాబాపై దోబూచులు ఆడాలని ఆశ
డాబా పైకెక్కాక దాహలే పెరిగాక
వెన్నెల్లో తడిశాక వెచ్చంగా మరిగాక
ముద్దుల్లో మునిగాక మునుముందుకు వెళ్ళాక
గుణకారం చేశాక ఘనకార్యం జరిగాక
అదికాస్త తెలిశాక ఆనందం ఎగిసాక
మరికాస్త అడిగాక అడిగాకా…
చెప్పూ… ఆశ ఆశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి
ఆశ దోశ జిగి జిగి జిగి జిగి జిగి జిగి తీర్చే ఆశ
ఎన్ని జన్మలెత్తిన ఆడదిగా పుట్టాలని
మగవాడై పుట్టాలని
చిట్టి గౌను వయసులోంచి చీరలోకి రావాలని
ప్యాంటు నేను తొడగాలని
పెళ్లంటూ చేసుకుంటే…
నిన్నే నిన్నే నిన్నే నిన్నే చేసుకోవాలని
అన్నీ అన్నీ అన్నీ అన్నీ ఇచ్చుకోవలనీ
ఆశ ఆశ ఆశ ఆశ పిచ్చి ఆశ పిచ్చి ఆశ చచ్చే ఆశ
ఆశ ఆశ ఆశ ఆశ
********* ******** *******
చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్ , చిత్ర
నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో…
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో…
అహా రెక్కల పువ్వై రివ్వున రావే చుక్కలతోనే ముద్దాడిస్తా
నెమలి కన్నోడ డా డా డా డా
చిలకా నీ మొగ్గ దా దా దా దా
ఏ పూలతో కొలవాలయ్యో ఆరడుగుల వజ్రం నువ్వే
కన్నె ముద్ర అద్దావంటే వెన్న ముద్దై పోదా వజ్రం
నీ ఛాతి విఖ్యాతి అహా తెలుసులే లేలేత నా బుగ్గలో మొటిమకు
నీ నడుము హరివిల్లు గవనలు అని ఆకాశం దిగివచ్చి పలికిందిలే
చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే
చిచ్చర పిడుగై చొచ్చుకు పొతే పచ్చడి ఆకై విచ్చుకు పోతా
తననా నానాన నెమలి కన్నోడ
నననా నానాన నమిలే చూపొడ
నెమలి కన్నోడ నమిలే చూపొడ కమిలిపోకుండా తాకాలయ్యో…
తనన నన్నా తనన నన్నా తననననా
తనన నన్నా తనన నన్నా తనననన తనననా
ఎండా కన్నే తగలకుండా దాచుకున్నా జాబిలి ఇవ్వు
ఎంగిలికాని తీర్ధం తెచ్చి నాపై చల్లి ఎత్తుకుపోరా
బంగారం పరుగెత్తి వచ్చిందిలే నీ మేని చమటయ్యి కరిగేందుకు
నీ రెప్ప చిరుగాలి విసిరిందిలే నా మనసు లో తేమ ఆరేందుకు
అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే
అబ్బోయబ్బా దెబ్బ కొట్టవే తీపి గుండెలో ఆశ పుట్టిందే
తననా నానాన చిలకా నీ మొగ్గ
తననా నానాన నలిపే పోతాగా
చిలకా నీ మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమ్మో హై
అరె బొడ్డుకు ఉన్న తాళం తీస్తే వద్దున పడ్డ చాపై పోతా
డా డా డా డా
దా దా దా దా
డా డా డా డా
దా దా దా దా
********* ******** *******
చిత్రం: ఒకటో నెంబరు కుర్రాడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలు, గాడ్విన్
తొడకొట్టి చెబుతున్నా తొలిమాట
జబ్బ చరిచి చెబుతున్నా భలే మాట
రొమ్ము విరిచి చెబుతున్నా కాలు దువ్వి చెబుతున్నా
బల్ల గుద్ది చెబుతున్నా బంపరు మాట
ప్రేమన్నది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్కు
ప్రేమన్నది ప్రతి ఒక్కరు తీర్చాల్సిన మొక్కు
ప్రేమన్నది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం
ఆడ రెండక్షరాలు, మగ రెండే అక్షరాలు
ఆడ మగ మధ్య పుట్టు ప్రేమే రెండక్షరాలు
తప్పు రెండక్షరాలు, ఒప్పు రెండు అక్షరాలు
తప్పొప్పులు చేయించు ప్రేమే రెండక్షరాలు
బాధ రెండక్షరాలు, హాయి రెండక్షరాలు
ఈ రెంటిని కలిగించు ప్రేమే రెండక్షరాలు
ప్రేమన్నది ఫలిఇస్తే పెళ్ళి రెండక్షరాలు
ప్రేమన్నది వికటిస్తే పిచ్చికూడా రెండక్షరాలే
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం
ప్రేమన్నది ఒక గ్రామం, ప్రేమికులకు స్వగ్రామం
ఎదిరించిన వాళ్ళతోటి చెస్తుందోయ్ సంగ్రామం
ప్రేమన్నది పదో గ్రహం, అందించును అనుగ్రహం
అనుగ్రహమే పొందుటకు కావాలోయ్ నిగ్రహం
ప్రేమన్నది ఒక దారం, అన్నిటికది ఆధారం
ప్రేమించిన హృదయాల్లో పూస్తుందోయ్ మందారం
ప్రేముంటె సౌభాగ్యం, లేకుంటే దౌర్భాగ్యం
లవ్వాడుట ఆరోగ్యం ఆడకుంటే అదో అనారోగ్యం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం నేటి యువతకు సూత్రం
ఇదే తారక మంత్రం ఇది అక్షర సత్యం
********* ******** *******
చిత్రం: ఒకటొనంబర్ కుర్రోడు (2002)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు , కల్పన
అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో…
అయ్యహో అయ్యహో మంటలోన నెయ్యనువ్వు పొయ్యహో
అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో
అమ్మతోడు అందగత్తె హస్తవాసి హాయిగుంది అయ్యహో అయ్యహో
కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో…
అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో
అయ్యహో అయ్యహో ఇంటికొచ్చి ప్రేమతిండి మెయ్యహో
అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో అయ్యహో…
ఒంపులోన తిష్ట నేను వెయ్యహో తిష్ట నేను వెయ్యహో
దిండుతోటి దిష్టి నీకు తియ్యహో దిష్టి నీకు తియ్యహో
పోలికంత దానమల్లే చెయ్యహో… కౌగిలింత చీర నువ్వు నెయ్యహో…
గాలునేను దువ్వుతుంటే చూడహో నీకాలు నీకు చెప్పకుండా జారహో
ఒక్కసారి పుట్టునంట ప్రేమహో గుత్త జ్ఞాపకాలు పట్టునంట ప్రేమహో
అమ్మతోడు తుమ్మతోడు గుమ్మతోడు గుత్తగుంది అయ్యహో అయ్యహో
అగ్గిపుల్ల గీయగానే…
అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు
ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో…
అయ్యహో …
ఓ… సిగ్గుపైన మూత నువ్వు తియ్యహో మూత నువ్వు తియ్యహో
చిత్రమైన కూత నేను కుయ్యహో కూత నేను కుయ్యహో
నోటి తోటి నోరు నువ్వు ముయ్యహో…
మాటరాని తేనే బొమ్మ గియ్యహో…
చంప పైన గోటితోటి గిచ్చహో అది గుండెలోని మాసిపోని మచ్చహో
పట్టలేక నువ్వు నేను రెచ్చహో ఉడుకు పుట్టలేక విరహమంత చిచ్చహో
అమ్మతోడు అబ్బతోడు వీడితోడు వేడిగుంది అయ్యహో అయ్యహో
కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు
కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో…
అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో
అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో
అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో అయ్యహో…
అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో