Oke Kutumbam (1970)

చిత్రం: ఒకే కుటుంభం (1970)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, లక్ష్మి
దర్శకత్వం: ఏ. భీమ్ సింగ్
(దాసరి నారాయణరావు గారు ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు)
నిర్మాతలు: సి.హెహ్.రాఘవరావు, కె.బసవయ్య
విడుదల తేది: 21.12.1970

పల్లవి:
అందరికీ ఒక్కడే దేవుడు
అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
కొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా
దేవుడు ఒక్కడే… దేవుడొక్కడే

అందరికీ ఒక్కడే దేవుడు

చరణం: 1
పూలలో ఉన్నాయి వేల రకాలు
పక్షులలో ఉన్నాయి లక్ష విధాలు
పూలలో ఉన్నాయి వేల రకాలు
పక్షులలో ఉన్నాయి లక్ష విధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచి మనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు

చరణం: 2
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమి కాదు
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమి కాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు
మానవసేవే మాధవసేవ
బాధపడే సోదరులను ఆదుకునేము
మనుషులమై మనమంతా కలిసుంటాము

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు

చరణం: 3
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్థపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్టఫలం ఇప్పిస్తాము
స్వార్థపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్టఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము

అందరికీ ఒక్కడే దేవుడు
కొందరికి రహీము కొందరికి రాముడు
అందరికీ ఒక్కడే దేవుడు

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Top Reviews

See More Lyrics
Jebu Donga (1988)
error: Content is protected !!